For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెయ్యి రెట్లు పెరిగిన అనిల్ అంబానీ గ్రూప్ మార్కెట్ క్యాప్: రూ.8వేల కోట్లు జంప్

|

అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గత మూడు నెలల కాలంలో 1,000 రెట్లు పెరిగింది. ఈ ఏడాది మార్చి నెలలో ఈ సంస్థ మార్కెట్ క్యాప్ రూ.733 కోట్లుగా ఉండగా, మే 2021 నాటికి రూ.3,890 కోట్లకు చేరుకుంది. చివరి ట్రేడింగ్ జూన్ 18, 2021 నాటికి రూ.7,866 కోట్లుగా నమోదయింది. ఈ గ్రూప్ కంపెనీలు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్, రిలయన్స్ క్యాపిటల్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ గత 20 రోజుల్లో రెండింతలు పెరిగింది.

రిలయన్స్ పవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,446 కోట్లు, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్ క్యాప్ రూ.2,767 కోట్లు, రిలయన్స్ క్యాపిటల్ ఎం-క్యాప్ రూ.653 కోట్లుగా ఉంది. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్, రిలయన్స్ క్యాపిటల్‌కు దాదాపు 50 లక్షల రిటైల్ ఇన్వెస్టర్లు ఉన్నారు. రిలయన్స్ గ్రూప్ ఎప్పటికైనా పైకి లేస్తుందని విశ్వసించారో మరేమిటో కానీ ఈ గ్రూప్‌లో ఇన్వెస్ట్ చేసినవారి సంపద భారీగా ఎగిసింది.

Reliance Group M cap surges thousands to nearly Rs 8,000 crore

భారత్‌లో రిలయన్స్ గ్రూప్ అతిపెద్ద రిటైల్ షేర్ హోల్డర్స్ కలిగిన ఫ్యామిలీ. రిలయన్స్ పవర్‌లో దాదాపు 33 లక్షల రిటైల్ షేర్ హోల్డర్లు ఉన్నారు. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 9 లక్షలు, రిలయన్స్ క్యాపిటల్‌లో 8 లక్షల షేర్ హోల్డర్లు ఉన్నారు. వివిధ కారణాలతో ఇటీవల రిలయన్స్ గ్రూప్ షేర్లు భారీగా ఎగిశాయి.

English summary

వెయ్యి రెట్లు పెరిగిన అనిల్ అంబానీ గ్రూప్ మార్కెట్ క్యాప్: రూ.8వేల కోట్లు జంప్ | Reliance Group M cap surges thousands to nearly Rs 8,000 crore

The market cap of Anil Ambani led Reliance Group has surged by over 1,000 per cent in less than three months.
Story first published: Sunday, June 20, 2021, 17:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X