Reliance-T Series: 135 మిలియన్ డాలర్ల బిగ్ డీల్: 10 మూవీలు సెట్స్‌పైకి

ముంబై: దేశీయ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ.. మళ్లీ క్రియాశీలకంగా మారబోతోన్నారు. చాలాకాలంగా ఆయన ఆర్థిక ఇబ్బందులు, ఆటుపోట్లను ఎదుర్కొంటూ వస్తోన్నారు. భారీగా నష్టాలను చవి చూస్తోన్నారు. ముఖేష్ అంబానీతో పోల్చుకుంటే- అనిల్ అంబానీ ఆస్తుల సంఖ్య కూడా తక్కువే. నేమ్ అండ్ ఫేమ్ కూడా ఆ స్థాయిలో ఉండట్లేదు.

అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రా 632 మిలియన్ డాలర్ల ఢిల్లీ మెట్రో ఆర్బిట్రేషన్‌ను గెలవడం ఆ కంపెనీకి ఊపిరి పోసినట్టయింది. దీనితో తన ఆధీనంలోని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను మరింత యాక్టివ్ చేయనున్నారు అనిల్ అంబానీ. ఇక వరుసగా భారీ సినిమాలను చిత్రీకరించడానికి అద్దిరిపోయే కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. హిందీ చలన చిత్ర పరిశ్రమకు కేరాఫ్‌గా నిలిచిన టీ-సిరీస్‌తో భారీ డీల్‌ను కుదుర్చుకున్నారు.

 Reliance Entertainment, T-Series sign $135 mn deal for more than 10 films in various genres

10 లేదా అంతకంటే ఎక్కువ సినిమాలను చిత్రీకరించడానికి 135 మిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించిన డీల్ అది. టీ-సిరీస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మధ్య ఈ మేరకు అగ్రిమెంట్ కుదిరింది. వేరియస్ జానర్లలో సినిమాలను తెరకెక్కించడానికి ఈ రెండు ఎంటర్‌‌టైన్‌మెంట్ కంపెనీలు జాయింట్ వెంచర్‌గా ఏర్పడ్డాయి. హైఓల్టేజ్ యాక్షన్ మూవీలు, ఉత్కంఠతను రేకెత్తించే అడ్వెంచర్స్, థ్రిల్లర్స్, బయోపిక్స్, ఫ్యామిలీ డ్రామా వంటి వేర్వేరు జానర్లలో కనీసం 10 లేదా అంతకంటే ఎక్కువ సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లాలని ఈ రెండు ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీలు నిర్ణయించాయి. వచ్చే 36 నెలల్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది.

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా థియేటర్లకు వెళ్లడానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపట్లేదు. అదే సమయంలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి ఓవర్ ద టాప్ ప్లాట్‌ఫామ్స్ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశాయి. ఓటీటీలను దృష్టిలో ఉంచుకుని సినిమాలను తీసిన సందర్భాలు చాలా ఉన్నాయి. భారీ బడ్జెట్ మూవీలు సైతం ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. కరోనా వైరస్ కాలంలో తమ ఇళ్లనే సినిమా థియేటర్లుగా మార్చుకున్నారు ప్రేక్షకులు.

ప్రేక్షకులు సినిమా థియేటర్లకు రావడానికి పెద్దగా ఆసక్తి చూపని ఈ పరిస్థితుల్లో 135 మిలియన్ డాలర్ల డీల్ కుదరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. థియేటర్లు అందుబాటులో లేకపోయినప్పటికీ.. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోన్నాయని, అందుకే ఈ డీల్‌ను కుదుర్చుకున్నామని టీ-సిరీస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర భూషణ్ కుమార్ తెలిపారు. ఓటీట్ ప్లాట్‌ఫామ్స్‌ను దృష్టిలో ఉంచుకుని భారీ బడ్జెట్ సినిమాలను తీసే పరిస్థితి లేదని అన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+