RCom Loan Declared Fraud by SBI;స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (RCOM) కు ఇచ్చిన రుణాన్ని మోసపూరితంగా గుర్తించింది. జూన్ 23, 2025న పంపిన లేఖలో, బ్యాంక్‌లోని ఫ్రాడ్ ఐడెంటిఫికేషన్ కమిటీ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ రుణ నిబంధనలను ఉల్లంఘించి, సంబంధిత గ్రూప్ సంస్థల ద్వారా నిధులు మళ్లించిందని SBI తెలిపింది. ఫోరెన్సిక్ ఆడిట్లు, షోకాజ్ నోటీసులు ఆధారంగా ఈ మోసం గుర్తించబడింది. దీంతో, SBI ఈ రుణాన్ని మోసంగా ప్రకటించడమే కాకుండా, ఆనిల్ అంబానీ పేరును కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కి నివేదించనుంది.
ఇంతకు ముందే 2024 నవంబర్‌లో కెనరా బ్యాంక్ కూడా RCOM రుణాన్ని మోసంగా గుర్తించింది. అయితే, ఆ నిర్ణయాన్ని బాంబే హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.కాగా, RCOM ఇప్పటికే జూన్ 2019 నుంచి కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (CIRP) లో కొనసాగుతోంది. అప్పటి నుంచి కంపెనీని రిజల్యూషన్ ప్రొఫెషనల్ అనీష్ నిరంజన్ నానావటి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే రుణదాతలు ఆమోదించిన రిజల్యూషన్ ప్రణాళిక NCLT (నేషనల్ కంపెనీ లా ట్రైబునల్) ముందు సమీక్షలో ఉంది.

రిలయన్స్ కమ్యూనికేషన్స్ గతంలో భారతదేశంలో రెండవ అతిపెద్ద టెలికాం కంపెనీగా పేరు గాంచింది. 2005లో అంబానీ సోదరుల విభజన తర్వాత అనిల్ అంబానీ RComని చేపట్టారు. మొదట్లో "మాన్‌సూన్ హంగామా" ఆఫర్లతో సంచలనం రేపిన ఈ సంస్థ, CDMA వ్యవస్థపై ఎక్కువ దృష్టి పెట్టి దూసుకొచ్చిన GSM సునామిలో పట్టు కోల్పోయింది. 2008లో GSMలోకి అడుగుపెట్టినా, అప్పటికే పోటీదారులు మార్కెట్‌లో గట్టిగా నిలిచిపోవడంతో కంపెనీ భారీగా నష్టాల్లోకి కూరుకుపోయింది.
2010లో స్పెక్ట్రమ్ వేలంలో భారీగా ఖర్చు చేసి, RCom భారీ అప్పుల ఊబిలో పడింది. 2016లో రిలయన్స్ జియో ప్రవేశంతో, RCom వాణిజ్యంగా పూర్తిగా కుదేలైంది. ఆదాయం తగ్గిపోవడం, సబ్‌స్క్రైబర్ బేస్ పడిపోవడంతో 2017 చివరలో వైర్‌లెస్ కార్యకలాపాలను మూసివేసింది.2010 నాటికి 17% ఉన్న మార్కెట్ షేర్ 2016 నాటికి 10% కంటే తక్కువకు తగ్గిపోయింది. అప్పులు రూ. 45,000 కోట్లకు పెరిగాయి. కొన్ని ఆస్తులు జియోకు విక్రయించినా, దివాలా తప్పలేదు. 2019లో ఐబిసి కింద స్వచ్ఛందంగా దివాలాకు దరఖాస్తు చేసింది. అప్పటి నుంచి దాని పునరుద్ధరణ ప్రణాళిక NCLT పర్యవేక్షణలో ఉంది.
తాజా పరిణామాలపై RCom స్పందిస్తూ, "మేము ప్రస్తుతం IBC కింద రక్షణలో ఉన్నాం. అయినా, తాజా పరిణామాల నేపథ్యంలో లీగల్ అడ్వైస్ తీసుకుంటున్నాం. తదుపరి చర్యలపై ఆలోచిస్తున్నాం" అని పేర్కొంది. IBC చట్టంలోని Section 32A ప్రకారం, NCLT ఆమోదించిన పునరుద్ధరణ ప్రణాళిక అమలులోకి వచ్చిన తర్వాత, సంస్థ పాత నేరాల నుండి రక్షణ పొందుతుంది.
ఈ తాజా చర్యలతో ఆనిల్ అంబానీ మరోసారి వార్తల్లోకెక్కారు. RCom రుణాలు, దివాలా ప్రక్రియ, మోసం ఆరోపణలు అన్నీ కలగలిపి టెలికాం రంగంలో ఇప్పుడు సంచలనంగా మారాయి. తాజా పరిణామాలతో కంపెనీ షేర్లు నష్టాల్లో వెళ్లాయి. కాగా కంపెనీ దివాలా ప్రక్రియలో ఉన్నందున కంపెనీ షేర్ల ట్రేడింగ్ మూసివేశారు. బిస్‌ఇ ప్రకారం కంపెనీ షేర్లలో చివరి ట్రేడింగ్ జూన్ 30న జరిగింది. ఆ రోజున స్టాక్ 5% తగ్గి రూ.1.61కి చేరుకుంది.
అయితే అనిల్ అంబానీ క్లీన్ ఎనర్జీ, డిఫెన్స్ రంగాల్లో వ్యూహాత్మక అడుగులు వేస్తూ మళ్లీ వ్యాపార సామ్రాజ్యంలో అడుగుపెడుతున్నారు. ఆయన నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ సంస్థలు ఈ మధ్య అనేక ప్రభుత్వ మరియు ప్రైవేట్ ప్రాజెక్టులకు సంబంధించి టెండర్లు గెలుచుకున్నాయి. ఈ రంగాలలో అనుభవం కలిగిన అంతర్జాతీయ కంపెనీలతో కూడా కొత్త ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.దీంతో రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్ షేర్ల విలువ కూడా గత నెలల్లో గణనీయంగా పెరిగింది. ఇది మార్కెట్‌లో ఈ గ్రూప్ కంపెనీలపై మళ్లీ నమ్మకం పెరుగుతోందన్న సంకేతంగా భావిస్తున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications