ఓర్వకల్లులో రిలయన్స్ అతిపెద్ద పానీయాల తయారీ ప్లాంట్.. రాయలసీమలో వేలాది మందికి ఉద్యోగాలు..

Reliance Beverage Plant: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిలో, ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధి చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ పారిశ్రామిక వాడలో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద పానీయాల తయారీ ప్లాంట్ (Beverage Plant) శనివారం (నవంబర్ 21, 2026) నుండి తన ఉత్పత్తి కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించింది.

గత ఏడాది (2025) నవంబర్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగగా, రికార్డు స్థాయిలో కేవలం 12 నెలల వ్యవధిలోనే నిర్మాణం పూర్తయి ఉత్పత్తి ప్రారంభం కావడం విశేషం. పది ఉత్పత్తి లైన్లతో (10 Production Lines) అత్యాధునిక సాంకేతికతతో ఏర్పాటైన ఈ ప్రపంచ స్థాయి కేంద్రంలో ప్రముఖ స్వదేశీ శీతల పానీయం 'క్యాంపా కోలా' (Campa Cola)తో పాటు వివిధ రకాల పండ్ల రసాలు (Fruit Juices), ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తయారీ మొదలైంది.

Reliance beverage plant Asia largest beverage plant Reliance Andhra Pradesh Reliance Consumer Products Orvakal beverage plant Kurnool industries Campa Cola production Reliance Campa Cola plant Andhra Pradesh investment 1622 crore investment 1200 jobs in AP Rayalaseema industrial development 1622

ఈ చారిత్రాత్మక మైలురాయిపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (X) ద్వారా ప్రత్యేక వీడియోను విడుదల చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో తమ ప్రభుత్వం అనుసరిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' (Speed of Doing Business) విధానానికి ఈ ప్లాంట్ ఒక సజీవ నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. తరతరాలుగా భారతీయులు చూస్తూ పెరిగిన ఐకానిక్ స్వదేశీ బ్రాండ్ క్యాంపా కోలా నేడు రాయలసీమ గడ్డపై పునర్జన్మ పొందిందని.. ఓర్వకల్ నుండి భారతదేశంలోని ప్రతి ఇంటికీ, అలాగే అంతర్జాతీయ మార్కెట్లకు చేరువ కానుందని లోకేష్ వివరించారు. స్వదేశీ బ్రాండ్లు అంతర్జాతీయ దిగ్గజాలతో పోటీ పడుతుండటం.. అందుకు ఆంధ్రప్రదేశ్ వేదికగా నిలవడం ఎంతో గర్వకారణమని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read

ఈ భారీ ప్రాజెక్టు వల్ల రాయలసీమ ప్రాంత యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు వెల్లువెత్తనున్నాయి. ఓర్వకల్ ప్లాంట్ ద్వారా స్థానికులకు 1,200 ప్రత్యక్ష ఉద్యోగాలు లభించడంతో పాటు, రవాణా, లాజిస్టిక్స్, వ్యవసాయం, అనుబంధ రంగాలలో వేలాది మందికి పరోక్ష ఉపాధి మార్గాలు తెరుచుకోనున్నాయి. ఈ ప్లాంట్‌లో పనిచేస్తున్న స్థానిక యువతను చూస్తుంటే తనకు అత్యంత సంతోషం కలుగుతోందని లోకేష్ పేర్కొన్నారు.

నంద్యాలకు చెందిన మహేష్ హరి, కర్నూలుకు చెందిన ఆర్.కె. స్పూర్తి వంటి స్థానిక యువతీయువకులు ఇకపై తమ కెరీర్‌ను నిర్మించుకోవడానికి సుదూర నగరాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా సొంత జిల్లాలోనే ప్రపంచ స్థాయి పరిశ్రమలో పనిచేస్తున్నారని ఆయన ఉదాహరించారు. "యువత ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లడం కాదు, పరిశ్రమలే మన యువత వద్దకు రావాలన్నదే రాయలసీమకు మేమిచ్చిన హామీ.. నేడు అది నెరవేరిందని లోకేష్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌పై నమ్మకంతో భారీ పెట్టుబడి పెట్టిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ధన్యవాదాలు తెలిపిన ఆయన, రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఇటువంటి పారిశ్రామిక విజయాలను విస్తరింపజేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+