దేశ రాజధాని ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా కానున్నారు. ఈ గురువారం రాంలీలా మైదానంలో ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. షాలిమార్ బాగ్ అసెంబ్లీ స్థానం నుండి తొలిసారి బిజెపి ఎమ్మెల్యే అయిన రేఖ గుప్తాను బిజెపి పార్టీ అధిష్టానం ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా నియమించింది. రేఖ గుప్తా హర్యానాకు చెందినవారు. కానీ రేఖకు కేవలం 2 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఆమె కుటుంబం ఢిల్లీకి వచ్చింది. రేఖ వృత్తిరీత్యా న్యాయవాది. దీనికి ముందు ఆమె కౌన్సిలర్‌గా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆమె తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్నారు. రేఖా గుప్తా ముఖ్యమంత్రి అయిన తర్వాత, ప్రజలు ఆమె గురించి తెలుసుకోవడానికి ఆసక్తితో ఉన్నారు. అయితే రేఖ గుప్తా ఆస్తిలు ఏంటో తెలుసా..
అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన 11 రోజుల తర్వాత, బిజెపి చివరకు ఢిల్లీ ముఖ్యమంత్రి పేరును ప్రకటించింది. నేడు బుధవారం సాయంత్రం జరిగిన బిజెపి శాసనసభా పక్ష సమావేశంలో పరిశీలకులు ఓపి ధంకర్, రవిశంకర్ ప్రసాద్ బిజెపి కొత్త ముఖ్యమంత్రి పేరును ప్రకటించారు.

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖ గుప్తా నికర ఆస్తుల విలువ :
రేఖ గుప్తా ఆస్తులు మొత్తం ఆస్తులు: రూ.5.31 కోట్లు
రేఖ గుప్తాపై లోన్లు ఇంకా ఇతర అప్పులు: రూ.1.20 కోట్లు
రేఖ గుప్తా వార్షిక ఆదాయం
2023-24: రూ.6.92 లక్షలు
2022-23: రూ.4.87 లక్షలు
2021-22: రూ.6.51 లక్షలు
2020-21: రూ.6.07 లక్షలు
2019-20: రూ.5.89 లక్షలు
రేఖ గుప్తా భర్త మనీష్ గుప్తా ఆదాయం
2023-24: రూ.97.33 లక్షలు
2022-23: రూ.64.56 లక్షలు
2021-22: రూ.23.13 లక్షలు
రేఖ గుప్తాకి మారుతి XL6 (2020 మోడల్) కారు ఉంది, దీని విలువ దాదాపు రూ.4.33 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. రేఖ గుప్తా ఆస్తులకి సంబంధించిన ఈ వివరాలు ఆమె అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ సమయంలో ఇచ్చిన అఫిడవిట్ నుండి తీసుకోబడ్డాయి.
రేఖ గుప్తా రాజకీయ ప్రయాణం చూస్తే 1992లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో చేరారు. 1995-96లో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (DUSU) కార్యదర్శి అయ్యారు. 1996-97లో DUSU అధ్యక్షురాలయ్యారు. 2007లో ఉత్తర పితంపుర నుండి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 2010లో BJP జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలయ్యారు. 2022లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) మేయర్ పదవికి BJP అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
2023లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నుండి MLAగా ఎన్నికయ్యారు.రేఖ గుప్తా తండ్రి గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్. ఆమె కుటుంబం 1976లో ఢిల్లీకి మకాం మార్చింది. రేఖ గుప్తా తన మొత్తం విద్యను ఢిల్లీలో పూర్తి చేసింది. ఈ సమయంలో ఆమె ABVP (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్)లో చేరి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
ప్రస్తుతం రేఖ గుప్తా పేరు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే ఢిల్లీ ముఖ్యమంత్రిగా దివంగత & మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ (ఒకప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా) తర్వాత బిజెపి నుండి రెండవ మహిళా ముఖ్యమంత్రి రేఖ గుప్తా. రేఖ గుప్తా 1974లో జింద్ జిల్లాలోని జులానా ఉపవిభాగంలోని నంద్‌గఢ్ గ్రామంలో జన్మించారు.
పేరు: రేఖ గుప్తా
వయసు: 50
పార్టీ: బిజెపి టికెట్‌పై మొదటిసారి బిజెపి ఎమ్మెల్యే అయ్యారు.
అసెంబ్లీ నియోజకవర్గం: షాలిమార్ బాగ్
విద్య: గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ (2022 సంవత్సరంలో చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం, మీరట్, IMIRC కాలేజ్ ఆఫ్ లా భైనా ఘజియాబాద్ నుండి LLB)
రాజకీయ జీవితం: ఎమ్మెల్యే కావడానికి ముందు ఆమె కౌన్సిలర్, మాజీ ప్రధాన కార్యదర్శి అండ్ ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఇంకా పార్టీ ఢిల్లీ రాష్ట్ర యూనిట్ ప్రధాన కార్యదర్శి.
వృత్తి: న్యాయవాది
భర్త: మనీష్ గుప్తా


Click it and Unblock the Notifications