భారీగా తగ్గిన బంగారం ధరలు: పసిడి ప్రియులకు శుభవార్త; నేడు హైదరాబాద్లో ధరలిలా!!
తాజాగా మరో మారు బంగారం ధరలు తగ్గడంతో కొనుగోలుదారులు బిగ్ రిలీఫ్ ఫీలవుతున్నారు. నేడు తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలలో రోజురోజుకూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుండి విపరీతంగా పెరిగిన బంగారం ధరలతో ఇన్వెస్టర్లు బంగారం కొనుగోలుకు, మార్కెట్ పై దృష్టి సారించారు. ఇక ఇదే సమయంలో బంగారం ధరలు తగ్గుతాయని సామాన్యులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కాస్త బంగారం ధరలు తగ్గినా బిగ్ రిలీఫ్ గా ఫీలవుతున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలు తాజాగా మరో మారు బంగారం ధరలు తగ్గడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో బంగారం ధరలిలా
నేడు దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరల విషయానికి వస్తే హైదరాబాదులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52,400 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57 వేల 160 రూపాయలుగా ట్రేడ్ అవుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,160 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,400గా ట్రేడ్ అవుతోంది. అంతే కాదు విశాఖపట్నంలోనూ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57 వేల 160 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,400గా కొనసాగుతుంది.

ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో నేడు ధరలు ఇలా
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,310 గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుండగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,450గా ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,400గా ట్రేడ్ అవుతుండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ముంబైలో 57 వేల 160 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,450 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర బెంగళూరులో ప్రస్తుతం 57,210 గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 53,200గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 58,040గా ట్రేడ్ అవుతుంది.

నిన్నటితో పోలిస్తే బంగారం ధరల తగ్గుదల.. రిలీఫ్
నిన్నటితో పోలిస్తే బంగారం ధరలు తగ్గుదల సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కాస్త ఊరట నిస్తుంది. గత కొంతకాలంగా కొనసాగుతున్న ధరల దూకుడు బంగారం ధరలను రెండేళ్ల గరిష్టానికి తీసుకువెళ్లింది. ఇప్పటికీ బంగారం ధరల మధ్య హెచ్చుతగ్గులు కొనసాగుతున్న క్రమంలో ధరల పెరుగుతాయా.. తగ్గుతాయా అన్నది కొనుగోలుదారులలో ఉత్కంఠను రేకెత్తిస్తుంది.


Click it and Unblock the Notifications