ఎర్ర సముద్రానికి మనకి ఇంటర్నెట్ ఆగిపోవడానికి సంబంధం ఏంటి... మీకు తెలుసా
ఇంటర్నెట్ స్లో అవ్వడం, వీడియో కాల్స్‌లో స్టక్ అవ్వడం, క్లౌడ్ సర్వీసులు లోడ్ కాకపోవడం... ఇటీవలి రోజుల్లో ఈ సమస్యలు ఎందుకు వచ్చాయో తెలుసా? కారణం ఎర్ర సముద్రంలో జరిగిన అండర్ సీ కేబుల్ డ్యామేజ్. భారత్, పాకిస్తాన్, సౌదీ అరేబియా, కువైట్, UAE లాంటి దేశాల్లో కనెక్టివిటీ స్లో అయింది. ఇక మైక్రోసాఫ్ట్ కూడా ముందే వార్నింగ్ ఇచ్చింది. మిడిల్ ఈస్ట్ వాళ్లకు ఇంటర్నెట్ స్లోగా అనిపించే ఛాన్స్ ఉందని.

ఎర్ర సముద్రం ఎందుకు ఇంత ఇంపార్టెంట్?
ఎర్ర సముద్రం అనేది ప్రపంచ ఇంటర్నెట్‌కి మైన్ హైవే లాంటిది. మనం రోడ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు హైవేలు ఎలాంటివో, ఇంటర్నెట్‌కి కూడా అలాంటి హైవేలు ఉంటాయి. కానీ ఇవి మనకు కనిపించవు. ఇవి సముద్రం కింద వేసిన ఫైబర్ కేబుల్స్. యూరప్, ఆఫ్రికా, ఆసియా ఈ మూడు ఖండాలను కనెక్ట్ చేసే కేబుల్స్‌లో చాలా వరకు ఎర్ర సముద్రం గుండా వెళ్తాయి. అందుకే ఈ రూట్‌లో చిన్న ప్రాబ్లమ్ వచ్చినా, ఆ ప్రభావం సగం ప్రపంచానికే పడుతుంది.
దాదాపు ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో 17% వరకు ఈ రూట్ ద్వారానే జరుగుతుంది. అంటే ఒక కేబుల్ కట్ అయితే, అనేక దేశాల్లో ఇంటర్నెట్ లైఫ్ దెబ్బతింటుంది.
ఎవరు కట్ చేశారు?
AP రిపోర్ట్స్ ప్రకారం కొన్ని సార్లు షిప్ యాంకర్ పడటం వల్ల కూడా కేబుల్స్ కట్ అవుతాయి. అలా యాదృచ్ఛికంగా కూడా జరిగే అవకాశం ఉంది. కానీ ఈసారి మాత్రం కాస్త సస్పీషస్‌గా ఉంది. యెమెన్‌లోని హౌతి రెబల్స్. వాళ్లు ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తూనే ఉన్నారు. అందుకే ఈ కేబుల్ కట్ కూడా వాళ్ల అటాక్స్‌లో భాగమేనేమో అన్న అనుమానం ఎక్కువైంది. యెమెన్‌లోని మంత్రులు కూడా ఇదే పాయింట్ చెబుతూ, 'ఇది యాదృచ్ఛికం కాదు, హౌతి మిలీషియా అటాక్స్‌లో భాగమే' అని క్లియర్‌గా ఆరోపించారు.
భారత్‌కు ఏమవుతోంది?
మన దేశంలో కూడా స్లో ఇంటర్నెట్ అనుభవించిన వారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే SMW4, IMEWE లాంటి కీలక కేబుల్స్ ఈజిప్ట్-సౌదీ రూట్ దగ్గర డ్యామేజ్ అయ్యాయి. ఇవి మన క్లౌడ్ సర్వీసులు, వీడియో స్ట్రీమింగ్, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ల పై డైరెక్ట్ ఇంపాక్ట్ చూపించాయి.
అసలు ఈ కేబుల్స్ ఎవరు వేస్తారు?
మన ప్రభుత్వాలు కాదు, ఎక్కువగా ప్రైవేట్ కంపెనీలు, గ్లోబల్ కన్సార్టియంలు ఇవి వేసే పని చేస్తాయి. భారత్‌లో టాటా కమ్యూనికేషన్స్, రిలయన్స్ జియో, ఎయిర్టెల్, సిఫీ, BSNL ప్రధాన ప్లేయర్స్. ప్రపంచవ్యాప్తంగా సబ్‌కామ్, ఆల్కాటెల్ సబ్‌మెరైన్ నెట్‌వర్క్‌లు లాంటి కంపెనీలు లీడ్ తీస్తాయి.
భారత్ ప్లాన్ ఏమిటి?
ఇంటర్నెట్‌కి ఒకే రూట్‌పై డిపెండ్ అయితే ఎప్పుడైనా రిస్క్ ఎక్కువే. ఎర్ర సముద్రం కేబుల్ కట్‌తో మనం చూశాం కదా, ఒక్క ప్రాబ్లమ్ వస్తే దేశాలంతా స్లో ఇంటర్నెట్‌తో ఇబ్బందులు పడతాయి. అందుకే భారత్ ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టింది. వాటిలో IAX (India-Asia-Express), IEX (India-Europe-Express), ఇంకా మెటా కంపెనీ తీసుకొస్తున్న 2Africa Pearls ప్రాజెక్ట్ కూడా ఉన్నాయి. ఇందులో 2Africa Pearls ప్రపంచంలోనే పొడవైన అండర్‌సీ కేబుల్ సిస్టమ్ అవుతుంది. ఇవన్నీ కనెక్ట్ అయ్యాక మనకు అదనపు రూట్లు వస్తాయి. అంటే, భవిష్యత్తులో ఒకే చోట సమస్య వచ్చినా, మన ఇంటర్నెట్ అంతగా డిస్టర్బ్ కాకుండా సేఫ్‌గా పనిచేస్తుంది.
ఎర్ర సముద్రం కేబుల్ కట్ ఒక రిమైండర్ లాంటిది. ఇంటర్నెట్ అంటే కేవలం WiFi సిగ్నల్ లేదా మొబైల్ డేటా కాదు, సముద్రం కింద ఉన్న ఈ ఫైబర్ కేబుల్స్ మన డిజిటల్ లైఫ్‌లైన్.
ఇక భారత్ AI, క్లౌడ్, 5G, ఈ-కామర్స్‌లో ముందుకు వెళ్లాలంటే, సేఫ్ మరియు డైవర్స్ కేబుల్ నెట్‌వర్క్స్ తప్పనిసరి. ఈ సంఘటన ఇంటర్నెట్ సేఫ్టీ అంటే కేవలం సైబర్ సెక్యూరిటీ కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రిటికల్. భారత్ ఇప్పుడు కొత్త ప్రాజెక్టులతో గ్లోబల్ డిజిటల్ మ్యాప్‌లో తన స్థాయిని పెంచుకోవాల్సిన టైమ్ వచ్చింది.


Click it and Unblock the Notifications