For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉపాధి రేటు రికవరీ అసంపూర్ణంగా.. సీఎంఐఈ నివేదిక

|

కరోనా మహమ్మారి వల్ల భారీగా పెరిగిన నిరుద్యోగిత రేటు క్రమంగా తగ్గుతోంది. గతవారం దేశంలో నిరుద్యోగిత రేటు 6.4 శాతం మేర తగ్గింది. ఓ వైపు నిరుద్యోగిత రేటు తగ్గినప్పటికీ, ఉపాధి, కార్మిక భాగస్వామ్య రేటు తగ్గుతోందని, భారత రికవరీ అసంపూర్తిగా ఉందని భావిస్తున్నారు. ఇటీవల గత కొద్దివారాలుగా నిరుద్యోగిత రేటు తగ్గుతోందని, అయితే ఉపాధి రేటు పడిపోతోందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) వెల్లడించింది.

CMIE వీక్లీ నివేదిక ప్రకారం లేబర్ పార్టిసిపేషన్ రేట్ ఆగస్ట్ నెలలో 40.96 శాతం ఉండగా, ఇప్పుడు 40.3 శాతానికి క్షీణించింది. దేశంలో ఉపాధి రేటు 37.5 శాతంగా ఉంది. మొదటి మూడు వారాల్లో 37.9 శాతంగా ఉంది. జూన్ 21వ తేదీ నుండి ఉపాధి రేటు ప్రతికూల ధోరణితో సాగుతోందని, ఇది ఆందోళనను కలిగిస్తోందని సీఎంఐఈ నివేదిక తెలిపింది.

వర్క్ ఫ్రమ్ హోమ్ భేష్, చైనా గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్!: బిల్‌గేట్స్వర్క్ ఫ్రమ్ హోమ్ భేష్, చైనా గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్!: బిల్‌గేట్స్

Recovery in Indias employment rate incomplete, says CMIE

సీఎంఐఈ నివేదిక ప్రకారం సెప్టెంబర్ నెలలో ఉపాధి ధోరణి కొంత మిశ్రమంగా ఉంది. నెలలో మొదటి మూడు వారాల్లో సగటు ఉపాధి రేటు 37.9గాఉందని, ఇటీవలి నివేదికల కంటే ఇది బాగానే ఉందని, కానీ రికవరీ ప్రతికూలంగా ఉందని పేర్కొంది. ఏప్రిల్‌లో దారుణ పతనం అనంతరం జూన్ 21 వారంతో ఉపాధి రేటు 38.4 శాతానికి చేరుకుంది.

సీఎంఐఈ ప్రకారం ఉపాధి రేటు మరింత తగ్గడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని, ప్రభుత్వ అంచనాలు, ప్రయివేటు రంగాల ప్రోత్సాహకాలు అని తెలిపారు. కరోనా కారణంగా ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా కోలుకోకపోవడంతో ప్రయివేటు రంగ వ్యాపారంలేక, కొత్త ఉద్యోగాల సృష్టి ఇబ్బందికరంగా మారింది.

English summary

ఉపాధి రేటు రికవరీ అసంపూర్ణంగా.. సీఎంఐఈ నివేదిక | Recovery in India's employment rate incomplete, says CMIE

The unemployment rate in the country dropped to 6.4% last week but it comes with falling employment and labour participation rates, suggesting India may slip from the incomplete recovery in the absence of a well-thought recovery plan, the Centre for Monitoring Indian Economy said.
Story first published: Friday, September 25, 2020, 12:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X