For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇక, రియల్‌మి స్మార్ట్ టీవీ: రేపే మరిన్ని వివరాలు వెల్లడయ్యే ఛాన్స్

|

చైనాకు చెందిన మొబైల్ ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి భారత మార్కెట్లోకి కొత్త ఉత్పత్తులను తీసుకు రాబోతోంది. వివిధ రకాల స్మార్ట్ టీవీలతో పాటు ఫిట్‌నెస్ బ్యాండ్ సహా అనేక ఉత్పత్తులను పరిచయం చేయనుంది. ఈ మేరకు సంస్థ సీఈవో మాధవ్ సేథ్ వెల్లడించారు. 2020 ఏడాదిలోనే వీటిని ప్రారంభించాలని యోచిస్తోంది రియల్‌మి.

1% వడ్డీ తగ్గింది.. కానీ PPF రుణం తీసుకోవచ్చా? కారణాలు ఇవే1% వడ్డీ తగ్గింది.. కానీ PPF రుణం తీసుకోవచ్చా? కారణాలు ఇవే

రియల్‌మి స్మార్ట్ టీవీలు, ఫిట్‌నెస్ బ్యాండ్

రియల్‌మి స్మార్ట్ టీవీలు, ఫిట్‌నెస్ బ్యాండ్

రియల్‌మి స్మార్ట్ టీవీలు 2వ క్వార్టర్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని రెగ్యులేటరీ ఆమోదాలు వస్తే ఏప్రిల్ నెలలో కూడా అవకాశం ఉందని చెప్పారు. రియల్‌మీ-బ్రాండెడ్ ఐఓటి పరికరాలతో పాటు, ఫిట్‌నెస్ బ్యాండ్ రూపకల్పనపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. రియల్‌మి స్మార్ట్ టీవీలు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లు సహా అనేక ఉత్పత్తులు విడుదల చేస్తామని చెప్పారు.

రేపే మరిన్ని వివరాలు

రేపే మరిన్ని వివరాలు

తమ బ్రాండుకు చెందిన పరికరాలన్నింటిని ఉపయోగించేందుకు రియల్‌మి లింక్ యాప్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. అది యూనివర్సల్ కంట్రోల్ హబ్‌గానే కాకుండా స్మార్ట్ హోమ్ యాప్‌గా పని చేస్తుందని భావిస్తున్నారు. రియల్‌మి సంస్థ నుండి వచ్చే మరిన్ని ఉత్పత్తుల గురించి ఫిబ్రవరి 24న నిర్వహించే రియల్‌మి ఎక్స్‌పో 50ప్రో మొబైల్ విడుదల కార్యక్రమంలో వెల్లడిస్తారని భావిస్తున్నారు.

ఫీచర్స్ వెల్లడించలేదు..

ఫీచర్స్ వెల్లడించలేదు..

రియల్‌మి సీఈవో ఫ్రాన్సిస్ వాంగ్ ఇప్పటికే తన ట్విటర్‌ అకౌంట్ ద్వారా షేర్‌ చేసిన ఫోటో స్మార్ట్‌టీవీలకు సంబంధించినదిగా అందరూ భావిస్తున్నారు. రియల్ సౌండ్, రియల్ డిజైన్ రియల్ క్వాలిటీ క్యాప్షన్‌తో వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. రియల్‌మీ టీవీల పూర్తి ఫీచర్స్‌ను, మోడల్స్, ధరలను వెల్లడించలేదు.

English summary

ఇక, రియల్‌మి స్మార్ట్ టీవీ: రేపే మరిన్ని వివరాలు వెల్లడయ్యే ఛాన్స్ | Realme's Smart TVs coming to India in Q2 2020

Realme is planning to launch not one, but multiple smart TVs in India. The revelation comes from none other than Realme India CEO Madhav Sheth, who recently appeared in a YouTube video.
Story first published: Sunday, February 23, 2020, 14:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X