FY21లో భారతవృద్ధిపై ఎస్పీఐ రీసెర్చ్ ఏం చెప్పిందంటే? ఆ 2 కాస్త ఊరట..
2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్) మధ్య భారత జీడీపీ 23.9 శాతం మేర క్షీణించింది. భారత ఆర్థిక ఈ ఆర్థిక సంవత్సరంలో దారుణంగా క్షీణిస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. తదుపరి రెండు క్వార్టర్‌లలోను ప్రతికూలత నమోదు చేస్తుందని, నాలుగో క్వార్టర్ నాటికి కాస్త సానుకూలంగా ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎస్బీఐ రీసెర్చ్ ఎకోరాప్ FY21లో రియల్ జీడీపీ మైనస్ 10.9 శాతం మేర ఉంటుందని అంచనా వేస్తోంది. అంతకుముందు మైనస్ 6.8 శాతంగా అంచనా వేసింది. అంటే అంతకుముందు అంచనా కంటే 4.1 శాతం అధికం.

అన్ని క్వార్టర్‌లలోను మైనస్
ఎస్బీఐ రీసెర్చ్ ఎకోరాప్ అంచనాల ప్రకారం 2020--21లో అన్ని త్రైమాసికాల్లోను ప్రతికూల జీడీపీ నమోదయ్యే అవకాశముంది. దీంతో పూర్తి సంవత్సరానికి 10.9 శాతం క్షీణత ఉండవచ్చు. రెండో క్వార్టర్‌లో మైనస్ 12 శాతం నుండి మైనస్ 15 శాతం, మూడో క్వార్టర్‌లో మైనస్ 5 శాతం నుండి మైనస్ 10 శాతం, నాలుగో క్వార్టర్‌లో మైనస్ 2 శాతం నుండి మైనస్ 5 శాతం మేర తగ్గవచ్చునని అంచనా వేసింది.

వినియోగ వ్యయంలో క్షీణత
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు మార్చి 25వ తేదీ నుండి విధించిన లాక్ డౌన్ ప్రభావం పడినట్లు ఈ నివేదిక తెలిపింది. అనివార్యమైన కరోనా కట్టడి చర్యల వల్ల ప్రయివేటు వినియోగ వ్యయంలో భారీగా క్షీణత కనిపించిందని, నిత్యావసర వస్తువుల్లో తప్ప మిగతా వాటికి డిమాండ్ లేదని తెలిపింది. వినియోగ సామర్థ్యం లేకపోవడంతో పెట్టబడుల్లో రికవరీ కనిపించలేదని తెలిపింది. మొత్తం జీడీపీ అంచనాల్లో ప్రయివేటు వినియోగ వ్యయం వాటా పెరగడానికి ఇది ఒక కారణంగా తెలిపింది.

ఇవి సానుకూలం..
అయితే ఇన్ని ప్రతికూలతల నేపథ్యంలో ఇటీవల 2 సానుకూల విషయాలు కనిపించాయని నివేదికలో తెలిపింది. ఒకటి జూలై నెలలో ఆర్బీఐ క్రెడిట్ డేటా. ప్రధాన రంగాల్లో జూలైలో రుణాల పెరుగుదలను సూచించింది. ముఖ్యంగా MSE, వ్యవసాయం, అనుబంధ రంగాలు, వ్యక్తిగత రుణ క్రెడిటd గణనీయంగా పెరిగినట్లు తెలిపింది. రెండోది తొలి క్వార్టర్‌లో వివిధ రంగాలకు కొత్త ప్రాజెక్టులు కనిపించాయి. రోడ్లు, ప్రాథమిక రసాయనాలు, విద్యుత్, హాస్పిటల్స్, నీరు, మురుగునీటి పైపులైన్లలో ఎక్కువ కనిపించాయి. నిర్మాణ, వాణిజ్యం, హోటల్స్, విమానయానరంగాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని తెలిపింది.


Click it and Unblock the Notifications