రియల్ ఎస్టేట్ రంగంమంటేనే లాభాల పంట.. అందుకే అందరూ అటువైపు చూస్తుంటారు. ఇళ్లు కొనుగోలు లేదా అమ్మకాలు చేస్తుంటారు. ఓ ఇల్లు అమ్మితే అమ్మకందారునికి మంచి లాభాలు రావొచ్చు. అయితే అదే సమయంలో సరైన పన్ను లెక్కలు వేయకపోతే మీరు లక్షలు రూపాయలు కోల్పోవచ్చు. దీనిపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఓ ఇంటి ఓనర్ ఏకంగా రూ. 1.87 లక్షల పన్నులు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ఎందుకంటే అతను ఆదాయపు పన్ను చట్టంలో అనుమతించబడిన ముఖ్యమైన ఖర్చులను పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో అతను అదనంగా ఈ మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చింది.
ఈ విషయాన్ని TaxBuddy.com వ్యవస్థాపకుడు సుజిత్ బంగర్ లింక్డ్ఇన్‌లో వివరించారు. అతను పెట్టిన పోస్ట్ ప్రకారం.. ఒక ఇంటిని రూ. 1.2 కోట్లకు అమ్మిన వ్యక్తి, కేవలం కొనుగోలు ధర అయిన రూ. 80 లక్షలు మాత్రమే మూలధన లాభాల లెక్కలో నుండి మినహాయించాడు. అయితే చట్టం ప్రకారం అతను ఇంకా పలు ఖర్చులను కూడా తగ్గించవచ్చు. అలా చేసి ఉండి ఉంటే..అతని పన్ను బిల్లు రూ. 1.87 లక్షల వరకు తగ్గిపోయేదని చెప్పుకొచ్చాడు.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 55 ప్రకారం కొన్ని ఖర్చులను తగ్గించడం ద్వారా మీరు పన్ను విధించదగిన లాభాన్ని గణనీయంగా తగ్గించుకోచ్చు. అందులో స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజులు, బ్రోకరేజ్ లేదా కమిషన్ చెల్లింపులు, పునరుద్ధరణలు, నిర్మాణ మార్పులు, చట్టపరమైన, డాక్యుమెంటేషన్ ఖర్చులు వంటివి ఉన్నాయి. ఇన్‌వాయిస్ ఉన్న గృహ రుణ వడ్డీ సెక్షన్ 24(b) కింద మినహాయించనిది కూడా చెక్ చేయాలని సూచించారు.
ఆ వ్యక్తి రిజిస్ట్రేషన్ ఫీజులో రూ. 4.7 లక్షలు, పునరుద్ధరణలలో రూ. 6 లక్షలు, హోమ్ లోన్ వడ్డీలో రూ. 3 లక్షల ఖర్చులను లెక్కలోకి తీసుకోలేదు. సరైన డాక్యుమెంటేషన్ ఉంటే ఇవన్నీ పన్ను నుండి మినహాయింపు పొందే అవకాశం ఉంది. బంగర్ పేర్కొన్నట్లు సాధారణ నిర్వహణ, మూలధన మెరుగుదల మధ్య తేడాను సరిగ్గా గుర్తించాలి. ఉదాహరణకి చూసుకున్నట్లయితే లీక్ అయ్యే కుళాయి మార్పు, గోడలకు కొత్త పెయింట్ వేయడం మినహాయించదగిన ఖర్చులు కావు. కానీ మాడ్యులర్ కిచెన్, ఫ్లోర్ జోడింపు వంటి నిర్మాణాలు ఖచ్చితమైన బిల్లులతో ఉంటే మినహాయించవచ్చు.
ఇంకో అలర్ట్ న్యూస్ ఏంటంటే.. ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ AI ఆధారిత స్కానింగ్ టూల్స్ ద్వారా పన్ను ఫైలింగ్‌లు పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో ట్యాక్స్ కట్టే సమయంలో నకిలీ క్లెయిమ్‌లు ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకని నకిలీ బిల్లులను వాడొద్దు. చెల్లింపు రుజువులు కలిగిన అసలైన ఇన్‌వాయిస్‌లను మాత్రమే ఉంచండని బంగర్ చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications