కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం FY21 సంవత్సరానికి గాను ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసే గడువును జూన్ 30వ తేదీకి పొడిగించింది. ఈ నెలాఖరు నాటికి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే డబుల్ టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) చెల్లించాల్సి వస్తుంది. సెక్షన్ 206AB ప్రకారం గత రెండేళ్లుగా టీడీఎస్ చెల్లించని పక్షంలో డబుల్ టీడీఎస్ వర్తిస్తుంది. ఈ మేరకు బడ్జెట్ 2021లో కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటించారు.
ఈ నెలాఖరు గడువు దాటితే పన్నుచెల్లింపుదారులు అధిక టీడీఎస్ చెల్లించాల్సి రావచ్చు. గత రెండేళ్లలో ప్రతి సంవత్సరం రూ.50,000కు పైగా టీడీఎస్ మినహాయించుకొని లేదా వసూలు చేసి, ఆ రెండేళ్లు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే జూలై 1వ తేదీ నుండి ఆదాయ పన్ను శాఖ రెట్టింపు టీడీఎస్ వసూలు చేస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం బడ్జెట్ 2021లో కొత్త సెక్షన్లు 206ఏబీ, 206సీసీని ప్రవేశపెట్టింది.

ఆలస్యంగా రిటర్న్స్ దాఖలు చేసే వారిపై చర్యలు చేపట్టడం ఈ సెక్షన్ల ముఖ్య ఉద్దేశ్యం. రెట్టింపు టీడీఎస్ కొన్ని ట్రాన్సాక్షన్స్, వ్యక్తులకు వర్తించదు. ఇందులో వేతనాలు, పీఎఫ్ అడ్వాన్స్ పైన మినహాయించిన టీడీఎస్, లాటరీ, పజిల్స్, హార్స్ రేస్‌లో గెలిచిన సొమ్ముపై, సెక్షన్ 194ఎన్ కింద రూ.1కోటి నగదు ఉపసంహరణపై, సెక్,న్ 194 ఎల్బీసీ ఆదాయంపై, భారత్‌లో శాశ్వత ఏర్పాట్లు లేని ప్రవాస భారతీయులకు వర్తించదు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications