కరోనా మహమ్మారి కారణంగా భారత్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. లాక్ డౌన్ కారణంగా మన దేశం స్తంభించిపోయింది. ఇలాంటి ఆర్థిక ఒత్తిడిలో ఇండియాకు తన సహకారం కోరితే తప్పకుండా చేస్తానని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. దేశంలో కరోనా విజృంభణతో కేంద్రం విధించిన లాక్ డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. బ్యాంకింగ్, ఏవియేషన్, పర్యాటకం తదితర రంగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

తీవ్ర సంక్షోభం... మనకు ఆ పరిస్థితి లేదు
ప్రపంచమంతా ఇప్పుడు ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభంలో ఉందని రాజన్ చెప్పారు. ఇండియా విషయానికి వస్తే మన దేశంలో మొదటి సమస్య విదేశీ మారకద్రవ్యంలో కనిపిస్తుందన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో విదేశీ మారకం స్థిరంగా ఉందన్నారు. దీనికి ఆర్బీఐ ఇచ్చే సహకారం కారణం కావొచ్చునన్నారు. అయితే డాలర్‌తో పోలిస్తే ఇటీవల కొంత క్షీణించిందనే చెప్పాలన్నారు. బ్రెజిల్ వంటి దేశాల్లో దేశాల్లో 25 శాతం క్షీణించిందని, మనకు ఆ పరిస్థితి లేదన్నారు.

పిలిస్తే వస్తా
కరోనాపై పోరులో భారత్‌లో భాగస్వామి కావడానికి సిద్ధమేనని, పిలిస్తే వస్తానని రాజన్ చెప్పారు. కరోనా మహమ్మారితో పాటు లాక్ డౌన్ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతోంది. తిరిగి ఉత్తేజపరుచడం ఓ సవాల్. అయితే మోడీ ప్రభుత్వం ఆహ్వానిస్తే దేశ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దడానికి తనవంతు కృషి చేస్తానన్నారు.

కరోనా తీవ్రంగానే ఉంది..
అమెరికా, ఇటలీ తరహాలో భారత్‌లోను కరోనా విజృంభిస్తే దాన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని రాజన్ అన్నారు. ఈ వైరస్‌ను సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ప్రజారోగ్యంపై చూపిస్తోన్న ప్రభావం మన కళ్లకు గడుతోందన్నారు. ఆర్థిక కార్యకలాపాలు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయని, ఆర్థిక మాంద్యానికి నిదర్శనం అన్నారు. తగిన నిర్ణయాలు తీసుకుంటే వచ్చే ఏడాది కోలుకోవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు.

అన్నింటినీ నడపలేదు
ప్రధాని కార్యాలయం నుండి అన్నింటినీ నడపలేమని రాజన్ అన్నారు. ఇంకా ఎంతో చేయాల్సి ఉందని, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ఈ రంగంలోని నిపుణుల సలహాలు తీసుకోవాలన్నారు. దేశంలో ఇలాంటి వారు చాలామంది ఉన్నారన్నారు. ప్రధాని కార్యాలయం అన్నింటిని నడపాలని పట్టుబడితే సరికాదని, ఆలస్యమవుతుందని ఇటీవల తన బ్లాగ్‌లో అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications