అనిల్ అంబానీ రాజీనామాను తిరస్కరించిన RCom రుణ సంస్థల కమిటీ
ముంబై: రిలయన్స్ కమ్యూనికేషన్స్ (R.Com) డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ ఇటీవల రాజీనామా చేశారు. దీనిని రుణ సంస్థల కమిటీ తిరస్కరించినట్లు R.Com వెల్లడించింది. ఆయనతో పాటు మరో నలుగురు డైరెక్టర్లు ఛాయా విరానీ, రైనా కరానీ, మంజరీ కాకర్, సురేష్ రంగాచార్, సీఎఫ్ఓ మణికంఠన్ కూడా రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను పరిశీలన కోసం రుణ సంస్థల కమిటీకి పంపించారు. వీటిని తిరస్కరించినట్లు బీఎస్ఈ ఫైలింగ్ సందర్భంగా R.Com తెలిపింది.
భారీ అప్పుల కారణంగా R.Com ఇప్పుడు దివాలా ప్రక్రియను ఎదుర్కొంటోంది. జూలై - సెప్టెంబర్ త్రైమాసికానికి రూ.31 వేల కోట్లకు పైగా నష్టాన్ని నమోదు చేసింది. ఇప్పటి వరకు ఒక ఇండియన్ కార్పోరేట్ కంపెనీ ప్రకటించిన రెండో అత్యధిక నష్టం ఇది. క్వార్టర్ ఫలితాలు వచ్చిన మరుసటి రోజే అనీల్ రాజీనామా చేశారు. ఆ తర్వాత మిగతా వారు రాజీనామాలు సమర్పించారు.

ఐతే రుణ సంస్థల కమిటీ వారి రాజీనామాలను ఏకగ్రీవంగా తిరస్కరించిందని, R.Com డైరెక్టర్లు యథావిధిగా తమ విధుల్లో కొనసాగవచ్చునని, దివాలా ప్రక్రియ పరిష్కారానికి వారు కృషి చేయాలని R.Com బీఎస్ఈ ఫైలింగ్ సందర్భంగా తెలిపింది.
సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ.30,142 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. నిజానికి గత ఏడాది ఇదే త్రైమాసికానికి ఆర్‌కామ్ రూ.1,141 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అయితే సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో స్పెక్ర్టమ్ వినియోగ చార్జీలు, లైసెన్సు ఫీజుల చెల్లింపు(ఏజీఆర్) కోసం రూ.28,314 కోట్లు కేటాయించడం వల్లే ఆర్‌కామ్ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో కంపెనీ దివాలా అంచున నిలిచింది.


Click it and Unblock the Notifications