దేశంలో మరో ప్రముఖ బ్యాంకు దివాళా ముంగిట నిలుస్తోంది. ఇటీవలే ముంబైకి చెందిన పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఓపెరటివ్ బ్యాంకు (పీఎంసీ) దివాళా తీసిన విషయం తెలిసిందే. సరిగ్గా అలాగే ప్రస్తుతం ప్రైవేట్ రంగంలోని ఎస్ బ్యాంకు బ్యాంకు కూడా అదే దారిలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. గురువారం సాయంత్రం ఈ బ్యాంకు బోర్డును రద్దు చేస్తూ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయం తీసుకుంది. అలాగే బ్యాంకు వినియోగదారుల లావాదేవీలపై ఆంక్షలు విధించింది.
ఎస్ బ్యాంకు లో ఖాతాలు ఉన్న కస్టమర్లు ప్రస్తుతం గరిష్టంగా కేవలం రూ 50,000 నగదు మాత్రమే విత్ డ్రా చేసుకునేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎస్ బ్యాంకు లో ఒక ఖాతాదారునికి ఒకటికి మించిన అకౌంట్లు ఉన్నప్పటికీ ఆ కస్టమర్ మొత్తంగా రూ 50,000 వరకు మాత్రమే నగదు తీసుకోగలడని ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే జారీ చేసిన డ్రాఫ్ట్స్, పే ఆర్డర్లు మాత్రం పూర్తిగా చెల్లిస్తారు. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ లో ఒక కథనం ప్రచురించారు.

ఆ సమయంలో రూ 5 లక్షలు...
ప్రస్తుత ఆర్బీఐ ఆదేశాలు అందరు కస్టమర్లకు వర్తిస్తాయి. అయితే, అత్యవసరాలు ఉన్న కస్టమర్ల కు మాత్రం కొన్ని మినహాయింపులు ఉంటాయి. కస్టమర్ కు ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడితే, లేదా ఉన్నత విద్య కోసం, లేదా పెళ్లి వంటి సందర్భంలో మాత్రం గరిష్టంగా రూ 5 లక్షల వరకు నగదు ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. పీఎంసీ లో తొలుత అవకతవకలు బయట పడినప్పుడు కూడా ఆర్బీఐ 2019 సెప్టెంబర్ 24న ఇలాంటి ఆంక్షలే విధించింది. అప్పుడైతే మరీ తక్కువగా కేవలం రోజులు రూ 1,000 మాత్రమే నగదు ఉపసంహరణకు అవకాశం కల్పించారు. తర్వాత క్రమంగా దానిని గరిష్టంగా రూ 25,000 కు పెంచారు. ఇలా ఆరు నెలలు ఆంక్షలు కొనసాగాయి.

39 రోజుల్లో పరిష్కారం...
పీఎంసీ పై ఆంక్షలు విధించినప్పుడు వినియోగదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కొందరైతే షాక్ కు గురై చనిపోయినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. అప్పుడు నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆర్బీఐ కస్టమర్ల కు త్వరితగతిన ఒక మెరుగైన పరిష్కారం చూపేందుకు సమాయత్తమవుతోంది. అందుకే కస్టమర్లు ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని, వినియోగదారుల ప్రయోజనాలకు పూర్తి రక్షణ కల్పిస్తామని ఆర్బీఐ హామీ ఇస్తోంది. కేవలం 39 రోజుల్లో ఈ బ్యాంకు ను సరిదిద్దేలా ఒక మెరుగైన పరిష్కారాన్ని కేంద్ర ప్రభుత్వ అనుమతితో అమలు చేస్తామని ప్రకటించింది. కాబట్టి కస్టమర్లు దీర్ఘకాలం ఈ సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండదని ఆర్బీఐ పేర్కొంది.

హామీ ఎంత వరకు?
సహజంగా మనం ఏదైనా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసినా... పెద్ద మొత్తంలో ఖాతాల్లో నగదు నిల్వలు ఉన్నా... సదరు బ్యాంకు దివాళా తీస్తే మన మొత్తం సొమ్ముకు భరోసా ఉండదు. గతంలో అయితే అది గరిష్టంగా రూ 1 లక్ష మాత్రమే మనకు తిరిగి చెల్లించే అవకాశం ఉండేది. అయితే, ఇటీవలే ప్రభుత్వం దీనిపై పార్లమెంట్లులో చట్టం చేసింది. ఈ పరిమితిని రూ 5 లక్షల వరకు పెంచింది. బడ్జెట్ లో కూడా దీనిని ప్రతిపాదించారు. కాబట్టి, ఇక ముందు దేశంలో ఏదైనా బ్యాంకు దివాళా తీస్తే దానికి కూడా రూ 5 లక్షల పరిమితి వర్తిస్తుంది. అంటే మీరు ఎంతైనా సొమ్ము డిపాజిట్ చేయండి... ఇలాంటి సందర్భంలో మాత్రం దక్కేది రూ 5 లక్షలే. ఇందుకు తగిన బీమా ను మన తరపున బ్యాంకు తీసుకోవాల్సి ఉంటుంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications