రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. మానిటరీ పాలసీ కమిటీ (MPC) రెపో రేటును 4 శాతంగా ఉంచేందుకు ఓటు వేసింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. అక్టోబర్ 7వ తేదీ నుండి మూడు రోజుల పాటు ఆర్బీఐ MPC భేటీ అయింది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా నిర్ణయించింది.
రిటైల్ ద్రవ్యోల్బణం అధికంగానే ఉన్నందున ఈసారి కూడా రెపో రేటు యథాతథస్థితికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు ఉంటాయని ఆర్థిక నిపుణులు ముందుగానే అంచనా వేశారు. గత కొన్ని నెలలుగా సరఫరాలపరమైన లోపాల కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం కన్నా ఎక్కువగా ఉంటోంది. రెపో రేటు నిర్ణయానికి MPC రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. కాబట్టి కీలక వడ్డీ రేట్ల జోలికి వెళ్లలేదు.

ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం గత నెల 29న ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇండిపెండెంట్ సభ్యుల నియామకం జరగకపోవటం పాటు కనీసం నలుగురు సభ్యుల కోరమ్ లేని కారణంగా సమావేశం వాయిదా పడింది. కమిటీలో చేతన్ ఘటే, పమీదువా, రవీంద్ర దోలకియాల నాలుగేళ్ల పదవీకాలం సెప్టెంబర్ 29వ తేదీన ముగిసింది. వీరి స్థానంలో ప్రముఖ ఆర్థికవేత్తలు అషిమా గోయల్, జయంత్ ఆర్ వర్మ, శషాంక్ బిడేలను నియమించింది. అనంతరం అక్టోబర్ 7 నుండి మూడు రోజుల పాటు భేటీ అయింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications