న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న అత్యంత కీలక నిర్ణయాల్లో ఒకటి- పెద్ద నోట్ల రద్దు. అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సాల్లోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు మోడీ. అప్పట్లో అదో పెద్ద సంచలనం. బ్లాక్ మనీని అరికట్టాలనే ప్రధాన లక్ష్యంతో పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016 నవంబర్ 8వ తేదీన ప్రకటన చేశారాయన. అప్పటి నుంచే కొత్త కరెన్సీ నోట్లు మనుగడలోకి వచ్చాయి. 10 నుంచి 2000 రూపాయల వరకు కొత్త కరెన్సీ నోట్లు చలామణి అవుతున్నాయి.

మూడో సంస్కరణల దిశగా..
దేశ కరెన్సీ చరిత్రలో రెండో అతిపెద్ద సంస్కరణగా చెబుతుంటారు దీన్ని. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కరెన్సీ నోట్ల విషయంలో మరో సంచలనానికి తెర తీసినట్టే కనిపిస్తోంది. మూడో సంస్కరణగా మార్పులు చేర్పులు చేసే అవకాశాలను పరిశీలిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం రూపాయి నోట్ల మీద జాతిపిత మహాత్మాగాంధీ బొమ్మ ముద్రితమౌతోన్న విషయం తెలిసిందే. మహాత్ముడి బొమ్మతో పాటు దేశ చరిత్రను మార్చివేసిన మరో ఇద్దరు ప్రముఖుల బొమ్మలను ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ఈ ఇద్దరి బొమ్మలూ..
ఆ ఇద్దరు- నోబెల్ పురస్కార గ్రహీత, జాతీయ గేయ రచయిత రబీంద్రనాథ్ ఠాగూర్, దేశ అంతరిక్ష పరిశోధనల పితామహుడు, మిస్సైల్ మ్యాన్, దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఈ ఇద్దరి బొమ్మలను కూడా కరెన్సీ నోట్ల మీద ముద్రించే యోచనలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఉందని సమాచారం. రబీంద్రనాథ్ ఠాగూర్, ఏపీజే అబ్దుల్ కలాం బొమ్మలను వాటర్ మార్కులుగా ముద్రించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

గవర్నర్ పరిశీలనలో..
దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రిజర్వుబ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ పరిశీలనలో ఉన్నాయని, త్వరలోనే దీనిపై తుదినిర్ణయాన్ని తీసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకించి- 2000 రూపాయల నోటుపై మహాత్మగాంధీతో పాటు రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం వాటర్ మార్కులను ముద్రించాలని రిజర్వ్ బ్యాంక్ ఇంటర్నల్ కమిటీ ప్రతిపాదించిందని, దీన్ని గవర్నర్ శక్తికాంత దాస్ తుది ఆమోదం తెలపాల్సి ఉందని అంటున్నారు.

అమెరికా తరహాలో..
ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం.. అగ్రరాజ్యం అమెరికాను అనుసరిస్తోందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమౌతున్నాయి. అమెరికా ముద్రించే డాలర్ల మీద వేర్వేరు ప్రముఖలు బొమ్మలు ఉంటాయి. జార్జ్ వాషింగ్టన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, థామస్ జెఫర్సన్, ఆండ్రూ జాక్సన్, అలెగ్జాండర్ హామిల్టన్, అబ్రహం లింకన్.. వంటి ప్రముఖుల పేర్లతో డాలర్.. చలామణిలో ఉంటోంది. అదే తరహాలో రూపాయి నోట్ల మీద కూడా మహాత్మాగాంధీ బొమ్మ మాత్రమే కాకుండా.. ఇతర ప్రముఖుల ఫొటోలను కూడా ముద్రించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు.

శాంపిల్స్ సైతం రెడీ..
రబీంద్రనాథ్ ఠాగూర్, ఏపీజే అబ్దుల్ కలాం బొమ్మలను ముద్రించిన నోట్ల నమూనాలు కూడా సిద్ధమైనట్లు చెబుతున్నారు. రెండు వేర్వేరు శాంపిళ్లను ఆర్బీఐ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపొందించిందని తెలుస్తోంది. ఈ రెండు వాటర్ మార్కులను ఐఐటీ-ఢిల్లీ ప్రొఫెసర్ దిలీప్ టీ షహానీ డిజైన్ చేశారని సమాచారం. రెండు సెట్ల డిజైన్లను షహానీ సిద్ధం చేశారని, వాటిని తుది నిర్ణయం కోసం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వద్దకు పంపించారనే ప్రచారం ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications