RBI on Farm Loans: దశాబ్ధాలుగా దేశంలోని వ్యవసాయం ప్రజలకు ప్రధాన ఆదాయవనరుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుత కాలంలో వ్యవసాయంలో అధిక పెట్టుబడుల కారణంగా రైతులకు డబ్బు అవసరం పెరుగుతోంది. ఇందుకోసం అనధికారిక రుణదాతల నుంచి అధిక వడ్డీలకు రైతులు డబ్బు తెచ్చి వ్యవసాయంపై పెట్టుబడిగా పెడుతున్న సంగతి తెలిసిందే.
అయితే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తీసుకున్న నిర్ణయం రైతన్నలకు పెద్ద ఊరటను అందించే అంశంగా నిలుస్తోంది. ఆర్బీఐ దేశంలోని రైతులకు ఎలాంటి తాకట్టు లేకుండా బ్యాంకులు అందించి రుణాల విషయంలో పరిమితిని రూ.1.6 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచింది. కొత్తగా రుణాల విషయంలో తీసుకొచ్చిన సవరణ జనవరి 1, 2025 నుంచి అమలులోకి వస్తుందని రిజర్వు బ్యాంక్ ప్రకటించటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్య దేశంలోని చిన్న, సన్నకారు రైతులకు తాకట్టు, మార్జిన్‌లను మాఫీ చేయడం ద్వారా ఆర్థిక ఉపశమనం కలిగించడం లక్ష్యంగా ఉంది.

కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయాన్ని స్వాగతించింది. దేశంలోని 86 శాతం మంది రైతులు చిన్న భూస్వాములు, పెంచిన రుణ పరిమితి నుంచి నేరుగా లబ్ధి పొందుతారని హైలైట్ చేసింది. ఈ చర్య ఆర్థిక భారాలను తగ్గించడానికి, అవసరమైన వ్యవసాయ కార్యకలాపాలకు నిధుల ప్రాప్యతను మెరుగుపరుస్తుంది. రైతులు పంటలు, పరికరాలు, ఇతర కార్యాచరణ అవసరాల్లో పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. కొత్త రూల్స్ ప్రకారం రైతులకు పెంచిన రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఇప్పటికే తగిన మార్గదర్శకాలను ఆర్బీఐ దేశంలోని అన్ని బ్యాంకులకు వెల్లడించింది. అలాగే పరిమితి పెంపుపై రైతులకు సైతం అవగాహన కల్పించాలని బ్యాంకులకు ఆదేశాలు జారీచేయబడ్డాయి.
నేటి కాలంలో విపరీతంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా రైతులకు వ్యవసాయంలో అధిక మెుత్తంలో డబ్బు అవసరం అవుతోంది. ముఖ్యంగా విత్తనాల కొనుగోలు, ఎరువులు, పురుగుమందుల వంటి అవసరాలతో పాటు ఇతర ఇన్ పుట్ ఖర్చులు పెరుగుతున్నందున రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయం కొంత ఉపశమనంగా నిలుస్తుందని రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే అన్ ఆర్గనైజ్డ్ మార్గాల నుంచి ఇందుకోసం డబ్బును అప్పులుగా పొందటాన్ని తాజా చర్య నివారిస్తుందని వారు చెబుతున్నారు.
కేవలం పావలా వడ్డీ రేటుతో రూ.3 లక్షల వరకు రుణాలను అందించే ప్రభుత్వం సవరించిన వడ్డీ రాయితీ పథకానికి కూడా ఈ విధాన మార్పు పూరకంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ చర్య ఆర్థిక సదుపాయాన్ని మెరుగుపరచడమే కాకుండా, కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాల ప్రభావాన్ని పెంచుతుందని, రైతులకు వారి వ్యవసాయ ఆర్థిక నిర్వహణలో ఎక్కువ సౌలభ్యం, స్థోమత కల్పిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. వ్యవసాయం కూడా ఆర్థిక వృద్ధిలో భాగస్వామిగా మారటానికి రిజర్వు బ్యాంక్ సమయానుకూలంగా తీసుకున్న చర్యగా నిపుణులు ప్రస్తుత నిర్ణయాన్ని అభివర్ణిస్తున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధిని మెరుగుపరచటానికి ఇది దోహదపడుతుందని వారు భావిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications