ఈ మూడు బ్యాంకులకు వాత పెట్టిన ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) మూడు బ్యాంకులపై కొరడా ఝుళిపించింది. మార్గదర్శకాలను ఉల్లంఘించాయనే కారణంతో కోట్ల రూపాయల మేర జరిమానా విధించింది. లావాదేవీలు, ఆర్థిక కార్యకలాపాల విషయంలో బ్యాంకింగ్ రెగ్యులేటరీ రూపొందించిన నియమాలను అనుసరించకపోవడం వల్ల పెనాల్టీ విధించినట్లు వివరించింది.
అవి- సిటీ బ్యాంక్ (City Bank), బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda, BoB), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (Indian Overseas Bank, IoB). వేర్వేరు కారణాలతో ఈ మూడు బ్యాంకులకు వాత పెట్టింది ఆర్బీఐ (RBI). 10.34 కోట్ల రూపాయల మేర జరిమానా విధించింది.

అత్యధిక జరిమానాను సిటీ బ్యాంక్ ఎదుర్కొంది. అయిదు కోట్ల రూపాయల పెనాల్టీని చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ స్కీమ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఔట్ సోర్సింగ్‌పై బ్యాంకింగ్ రెగ్యులేటరీ ప్రవర్తనా నియమావళికి గైడ్‌లైన్స్‌ను పాటించకపోవడం వల్ల సిటీబ్యాంక్‌పై చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ వివరించింది.
బ్యాంక్ ఆఫ్ బరోడాపై విధించిన జరిమానా మొత్తం 4.34 కోట్ల రూపాయలు. కొన్ని నిర్దుష్ట ప్రాజెక్టులకు మంజూరు చేయడానికి ఆర్బీఐ అందుబాటులోకి తీసుకొచ్చిన రుణాలకు బదులుగా టర్మ్ లోన్‌ను మంజూరు చేయడం.. పెనాల్టీకి దారి తీసింది. నిర్దేశిత గడువులోగా సీనియర్ సిటిజన్ కేటగిరీ కింద కొన్ని డిపాజిట్లపై వడ్డీ రేటును బ్యాంక్ ఆఫ్ బరోడా చెల్లించకపోవడం పట్ల ఆర్బీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌పై కోటి రూపాయల జరిమానా పడింది. రెండు కార్పొరేట్ సంస్థలకు టర్మ్ లోన్‌లను పొడిగించే సమయంలో బ్యాంకింగ్ రెగ్యులేటరీ నిబంధనలను ఐఓబీ ఉల్లంఘించింది. నిర్దుష్ట ప్రాజెక్టుల కోసం అంచనా వ్యయం కంటే అధికంగా రుణాలను మంజూరు చేసిన కారణంగా పెనాల్టీ విధించినట్లు ఆర్బీఐ తెలిపింది.


Click it and Unblock the Notifications