Anil Ambani: ఒకప్పుడు దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల జాబితాలో అనిల్ అంబానీ ఒకరుగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే వ్యాపారాలు కుప్పకూలటంతో ఆయన కంపెనీలు దివాలా తీశాయి. బిలియనీర్ సైతం పేదవాడిగా మారిపోయారు.
అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ కంపెనీ రిజల్యూషన్ ప్లాన్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆమోదించింది. రిజర్వ్ బ్యాంక్ తాజా చర్యతో హిందూజా గ్రూప్ కంపెనీ ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్(IIHL) రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలుకు మార్గం సుగమమైంది. మరోవైపు రిలయన్స్ క్యాపిటల్ స్టాక్ బీఎస్ఈ ఇండెక్స్‌లో ట్రేడింగ్ పరిమితం చేయబడిన సంగతి తెలిసిందే.

అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ స్టాక్ మార్కెట్‌కు అడ్మినిస్ట్రేటర్ నవంబర్ 17, 2023 లేఖ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అందిన గ్రీని సిగ్నల్ గురించి వెల్లడించింది. అప్పుల ఊబిలో ఉన్న కంపెనీ కొనుగోలుకు హిందూజా గ్రూప్ రూ.9,650 కోట్లు వెచ్చించేందుకు ఆఫర్ చేసి అత్యధిక బిడ్డర్‌గా నిలిచింది. చెల్లింపుల్లో డిఫాల్ట్ కావటంతో పరిపాలనా సమస్యల దృష్యా రిలయన్స్ క్యాపిటల్ బోర్డును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 29, 2021న రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ(CIRP)కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ నాగేశ్వరరావు వైని నిర్వాహకుడిగా నియమించింది.
ఫిబ్రవరి 2022లో రిలయన్స్ క్యాపిటల్ విక్రయానికి ఆర్‌బీఐ నియమించిన అడ్మినిస్ట్రేటర్ లిక్విడేషన్ ప్రక్రియలో భాగంగా బిడ్లను ఆహ్వానించింది. దీంతో దేశంలో మూడవ అతిపెద్ద నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా ఉన్న రిలయన్స్ క్యాపిటల్ వ్యాపారాన్ని హిందుజా గ్రూప్ చేజిక్కించుకునేందుకు రంగంలోకి దిగింది.


Click it and Unblock the Notifications