d-sib: ఆర్థిక వ్యవస్థలో, ప్రజల దైనందిన జీవితంలో బ్యాంకుల పాత్ర కీలకం. డబ్బు, నగలు దాచుకోవడానికి అత్యంత సురక్షిత ప్రదేశాలుగా బ్యాంకులను నమ్ముతారు. 2022 నాటికి దేశ వ్యాప్తంగా 12 ప్రభుత్వ రంగ, 21 ప్రైవేటు రంగ బ్యాంకులు వివిధ రకాల సేవలు అందిస్తున్నాయి. అయితే, భారతదేశంలోని సురక్షిత బ్యాంకుల లిస్టును RBI తాజాగా విడుదల చేసింది. బ్యాంకులే సేఫ్టీకి మార్గం కాగా.. మరి ఈ సురక్షిత బ్యాంకులేంటి. వాటిని RBI ఎంపిక చేయడమేంటో తెలుసుకుందాం...

సురక్షిత బ్యాంకులు అంటే..?
భారత్ లోని సురక్షిత బ్యాంకుల జాబితాను RBI ఇటీవల విడుదల చేసింది. ఏటా ఈ లిస్ట్ ను కేంద్ర బ్యాంకు ప్రకటిస్తూ ఉంటుంది. HDFC, ICIC, SBI లు ఇందులో స్థానం దక్కించుకున్నాయి. వీటినే D-SIBలుగా వ్యవహరిస్తారు. అంటే డొమెస్టిక్ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంకులు అని అర్థం. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇవి వెన్నెముక లాంటివన్న మాట. ఆయా బ్యాంకులకు ఏదైనా సమస్య వస్తే మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

అవసరమేంటి ?
సురక్షిత బ్యాంకుల జాబితాను విడుదల చేస్తారు సరే.. ఏ విధంగా వాటిని ఎంపిక చేస్తారు ? ఇలా చేయాల్సిన అవసరం ఏమిటి అనే వివరాల్లోకి వెళ్దాం. 2008లో ప్రపంచం తీవ్ర మాంద్యాన్ని ఎదుర్కోవాల్సి రావడం అందరికీ తెలిసిందే. ఆర్థిక వ్యవస్థను సరిగా నిర్వహించలేక పెద్ద పెద్ద బ్యాంకులు సైతం కుప్పకూలాయి. పలు దేశాలు కష్టాల్లో కూరుకుపోయాయి. భవిష్యత్తులో ఈ తరహా ఇబ్బందులు వస్తే ఎలా ఎదుర్కోవాలనే ప్రశ్న వచ్చింది. దానికి సమాధానంగా ఉద్భవించినవే ఈ D-SIBలు. సురక్షిత బ్యాంకులుగా గుర్తించిన వాటికి ఏదైనా సమస్య వస్తే సత్వరం ప్రభుత్వం రంగంలోకి దిగి ఆదుకోవాలని అప్పుడే నిర్ణయించారు.

మరి నిబంధనలో...
D-SIBల్లో స్థానం సాధించాలంటే.. ఆ బ్యాంకు ఆస్తులు దేశ GDPలో 2 శాతం కంటే ఎక్కువగా ఉండాలి. ఆర్థిక రంగంలో వాటి ప్రాముఖ్యత ఆధారంగా 1 నుంచి 5 వర్గాలుగా విభజిస్తారు. ఐదో స్థానంలో ఉన్న బ్యాంకును అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. కానీ ఏ బ్యాంకూ ప్రస్తుతం ఐదో స్థానంలో లేదు. SBI మూడో స్థానంతో సరిపెట్టుకోగా.. ICICI, HDFCలు మొదటి ర్యాంకులో ఉన్నాయి. రిస్క్ వెయిటెడ్ అసెట్స్ లో కొంత భాగాన్ని టైర్ 1 క్యాపిటల్ (స్టాక్స్, క్యాష్ వంటి లిక్విడ్ అసెట్స్) లో ఉంచాలనే నిబంధనలు ఉన్నాయి.

అలా మొదలైంది...
ఈ సురక్షిత బ్యాంకుల ఎంపిక, సమస్యల పరిష్కారం వంటి విషయాల నిర్వహణ కోసం 2014లో RBI ఓ విధానాన్ని రూపొందించింది. 2015 నుంచి ఏటా జాబితాను విడుదల చేయడం ప్రారంభించింది. మొట్టమొదటి జాబితాలో SBI, ICICI మాత్రమే ఉండగా.. 2017 నుంచి HDFC సైతం ఇందులో చోటు దక్కించుకుంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications