RBI: ప్రస్తుతం ఎక్కడచూసినా డిజిటల్ పేమెంట్సస్ రాజ్యం ఏలుతున్నాయి. సింగిల్ క్లిక్ తో నగదు బదిలీ, చెల్లింపులు జరిగిపోతున్నాయి. RTGS, NEFT నుంచి UPI వరకు వివిధ టెక్నాలజీలను దేశంలో, బయటా విరివిగా వినియోగిస్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఈ తరహా సాంకేతిక ఆధారిత చెల్లింపుల వ్యవస్థ పనిచేయకపోతే ఎలా ట్రాన్సాక్షన్స్ చేయాలో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ?
కమ్యూనికేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు అంతరాయం కలిగించే విపత్తుల సమయంలో RTGS, NEFT మరియు UPI వంటి ప్రస్తుత చెల్లింపు వ్యవస్థల దుర్బలత్వాన్ని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(RBI) గుర్తించింది. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు లైట్ వైట్ చెల్లింపుల వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. అయితే ఇది సాంప్రదాయ సాంకేతికతలకు భిన్నంగా స్వతంత్రంగా పనిచేస్తుంది. విపరీతమైన పరిస్థితుల్లోనూ నిరంతరాయ లావాదేవీలకు భరోసా ఇస్తుంది.

"సాంప్రదాయ పేమెంట్ సిస్టమ్స్ సంక్లిష్టమైన వైర్డు నెట్‌వర్క్‌లు, అధునాతన IT మౌలిక సదుపాయాలపై ఎక్కువగా ఆధారపడతాయి. అయితే నిరంతర లభ్యతను కొనసాగిస్తూ భారీ లావాదేవీలు నిర్వహించడానికి వీలు కల్పిస్తాయి. కానీ ప్రకృతి వైపరీత్యాలు లేదా యుద్ధం సమయంలో కమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో అంతరాయాల వల్ల తాత్కాలికంగా ఈ వ్యవస్థలను అందుబాటులో ఉండవు" అని RBI తెలిపింది.
"ఇటువంటి విపరీతమైన, అస్థిర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, తేలికైన మరియు పోర్టబుల్ చెల్లింపు వ్యవస్థను రిజర్వ్ బ్యాంక్ రూపొందించింది. ఇది సంప్రదాయ సాంకేతికతలకు భిన్నంగా ఉంటుంది. అతి తక్కువ సిబ్బందితో ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయవచ్చు" అని RBI తన వార్షిక నివేదిక 2022-23లో పేర్కొంది.


Click it and Unblock the Notifications