హెచ్‍డీఎఫ్‍సీ బ్యాంక్ స్టాక్ గత ఏడు సెషన్లుగా పెరుగుతూ వస్తోంది. మార్చి త్రైమాసిక వ్యాపార నవీకరణలు డిపాజిట్లలో ఆకట్టుకునే వృద్ధి, లోన్-టు-డిపాజిట్ నిష్పత్తిలో క్షీణతను చూపించిన తరువాత హెచ్‍డీఎఫ్‍సీ బ్యాంక్ షేర్ ధర శుక్రవారం పెరిగింది. హెచ్‍డీఎఫ్‍సీ బ్యాంక్ షేరు ధర 11:35 గంటలకు రూ.1,548 వద్ద ట్రేడవుతోంది.
హెచ్‍డీఎఫ్‍సీ బ్యాంక్ Q4 డిపాజిట్ పనితీరు స్ట్రీట్ అంచనాల కంటే ఎక్కువగా ఉంది. అయితే రుణ వృద్ధి మందగించింది. మోర్గాన్ స్టాన్లీ స్టాక్ హెచ్‍డీఎఫ్‍సీకి అధిక వేయిటేజ్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ ను రూ.1,900 నిర్ణయించింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేరు ధర ఈ మధ్య కాలంలో తగ్గిన పనితీరు తర్వాత మంచి లాభాలను చవిచూస్తోంది. FY24లో స్టాక్ 10 శాతం క్షీణించింది.

బ్యాంక్ FY24 నాల్గో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఏప్రిల్ 20న ప్రకటించనుంది.హెచ్‍డీఎఫ్‍సీ బ్యాంక్ Q4 ఫలితాలను ఆమోదించడానికి ప్రైవేట్ రుణదాత డైరెక్టర్ల బోర్డు శనివారం ఏప్రిల్ 20న సమావేశం కానుంది. ఏప్రిల్ 4 గురువారం నాడు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో హెచ్‍డీఎఫ్‍సీ Q4FY24లో దాని స్థూల అడ్వాన్స్‌లు సంవత్సరానికి 55.4 శాతం పెరిగినట్లు పేర్కొంది. బ్యాంక్ దేశీయ రిటైల్ రుణాలు సంవత్సరానికి 108.9 శాతం, త్రైమాసికంలో 3.7 శాతం పెరిగాయని వివరించింది.
బ్యాంకింగ్ రుణాలు సంవత్సరానికి 24.6 శాతం పెరిగాయి. త్రైమాసికంలో 4.2 శాతం పెరిగాయి. దాని కార్పొరేట్, ఇతర హోల్‌సేల్ రుణాలు సంవత్సరానికి సుమారు 4.1 శాతం పెరగ్గా.. త్రైమాసికంలో మాత్రం 2.2 శాతం క్షీణించాయి. డిపాజిట్ల సంఖ్య మార్చి 31, 2024 నాటికి రూ.23,80,000 కోట్లుగా ఉంది. ఇది సంవత్సరానికి దాదాపు 26.4 శాతం పెరగ్గా.. త్రైమాసికంలో 7.5 శాతం పెరిగింది. రిటైల్ డిపాజిట్లు సంవత్సరానికి 27.8 శాతం పెరగ్గా.. త్రైమాసికంలో 6.9 శాతం పెరిగాయి.
Note: ఈ వార్త కేవలం సమాచారం మాత్రమే. సిఫార్సుగా భావించవద్దు.


Click it and Unblock the Notifications