Rakesh Jhunjhunwala: టైటాన్ షేర్..టైటానిక్ షిప్: ఒక్కరోజులో రూ.వందల కోట్లు నష్టం

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్‌లో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. స్టార్ ఇన్వెస్టర్‌గా గుర్తింపు పొందారు. ఇండియన్ వారెన్ బఫెట్‌గా పిలుస్తారు. షేర్ మార్కెట్‌లో ఆయన వేసే అంచనాలు నిజం అవుతుంటాయని చెబుతుంటారు. షేర్ల భవిష్యత్ ఎలా ఉండబోతోందనే విషయాన్ని అంచనా వేయడంలో దిట్ట. దానికి అనుగుణంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుంటారు.

రూ.560 కోట్లు

రూ.560 కోట్లు

ఇలా ఇన్వెస్ట్ చేసిన పోర్ట్‌ఫోలియోలు లాభాల బాటలో పట్టాయి. అలాంటి ఏస్ స్టాక్ ఇన్వెస్టర్- ఒక్క రోజు వ్యవధిలో వందల కోట్ల రూపాయలను నష్టపోవాల్సి వచ్చింది. 560 కోట్ల రూపాయలు దెబ్బకు ఎగిరిపోయాయి. కొన్ని గంటల వ్యవధిలో ఆవిరి అయ్యాయి. స్టాక్ మార్కెట్‌లో శుక్రవారం చోటు చేసుకున్న పరిణామాలు దీనికి కారణం అయ్యాయి.

టైటానిక్ షిప్‌లా..

టైటానిక్ షిప్‌లా..

ఆ స్టాక్.. టైటాన్. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు చెందిన సంస్థ ఇది. లగ్జరీ ప్రొడక్ట్స్ కంపెనీ ఇది. జ్యువెలరీ, వాచీలు, ఐవేర్.. వంటి ఫ్యాషన్ యాక్సెసరీస్‌ను ప్రమోట్ చేసే వింగ్. టైటాన్ షేర్లు.. టైటానిక్ షిప్‌లా మునిగిపోయాయి. ఒక్కరోజు వ్యవధిలో ఒక్కో షేర్ రూ.125.50 పైసల మేర నష్టాన్ని మిగిల్చాయి ఇన్వెస్టర్లకు. టైటాన్ షేర్ల ధరలు తగ్గడం వల్ల.. గరిష్ఠ స్థాయిలో నష్టపోయారు రాకేష్ ఝన్‌ఝున్‌వాలా.

ఒక్కో షేర్ మీద..

ఒక్కో షేర్ మీద..

టైటాన్‌కు చెందిన 3,53,10,395 షేర్లను రాకేష్ ఝున్‌ఝున్‌వాలా హోల్డ్ చేసి ఉంచారు. ఆయన భార్య రేఖ ఝున్‌ఝున్‌వాలా పేరు మీద ఉన్న టైటాన్ షేర్లు.. 95,40,575. భార్యభర్తల వద్ద ఉన్న టైటాన్ షేర్ల సంక్య 4,48,50,970. శుక్రవారం ఒక్కో షేర్ మీద రూ. 125.50 పైసల మేర నష్టం వచ్చింది. దాని విలువ 559.74 కోట్ల రూపాయలు.

1,935 రూపాయలకు..

1,935 రూపాయలకు..

ప్రస్తుతం ఆయన వద్ద ఉన్న టైటాన్ కంపెనీ షేర్ల విలువ 8,678.7 కోట్ల రూపాయలకు తగ్గిపోయింది. శుక్రవారం ఉదయం చాలాకాలంగా టైటాన్ షేర్లు నేలచూపులు చూస్తూ వస్తోన్నాయి. నెల రోజుల కిందట రూ.2,166.55 పైసలుగా నమోదైన టైటాన్ షేర్ల ధర శుక్రవారం దారుణంగా పడింది. 2,000 రూపాయల దిగువకు ట్రేడింగ్ అయింది. 1,935.40 పైసల వద్ద ముగిసింది.

డెల్టా కార్ప్ కూడా..

డెల్టా కార్ప్ కూడా..

కాగా.. తాను పెట్టుబడులు పెట్టిన షేర్లను క్రమంగా అమ్ముకుంటోన్నారు. తన వద్ద ఉన్న డెల్టా కార్ప్ షేర్లను ఖాళీ చేసేస్తున్నారు. కిందటి నెలలో డెల్టా కార్ప్‌కు చెందిన 25 లక్షల షేర్లను ఆయన స్టాక్ మార్కెట్‌లో సేల్ చేశారు. ఇప్పుడు మళ్లీ మరో ఆరుశాతం మేర కోత పెట్టారు. ఆయన భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలా కూడా 3.25 శాతం మేర డెల్టా కార్ప్ షేర్లను అమ్మి వేశారు.

టైటాన్ సహా..

టైటాన్ సహా..

డెల్టా కార్ప్‌‌కు మాత్రమే పరిమితం కాలేదాయన. టైటాన్ షేర్లను విక్రయించారు. తాను హోల్డ్ చేసి ఉంచిన టైటాన్ షేర్లల్లో ఆరుశాతం మేర విక్రయించారు. టాప్ ఫార్మాసూటికల్ కంపెనీలు లూపిన్, అరబిందో స్టాక్స్ కూడా రాకేష్ ఝున్‌ఝున్‌వాలా అమ్మివేసినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

కంపెనీల వారీగా షేర్లు..

కంపెనీల వారీగా షేర్లు..

ప్రస్తుతం ఆయన హోల్డ్ చేసి ఉంచిన షేర్లల్లో టైటాన్-6, యునైటెడ్ స్పిరిట్స్-4, ఎస్కార్ట్స్-2, క్రిసిల్-4.4, టాటా మోటార్స్-1.6, మెట్రో బ్రాండ్స్-1.4, స్టార్ హెల్త్-4 శాతం మేర ఉన్నట్లు తెలుస్తోంది. కిందటి నెలలో అయిదు రోజుల వ్యవధిలో డెల్టా కార్ప్‌కు చెందిన షేర్లను రాకేష్ ఝున్‌ఝున్‌వాలా అమ్మేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+