2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ డబుల్ డిజిట్‌కు చేరుకోవచ్చునని ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝన్‌ఝున్‌వాలా అన్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తాత్కాలికమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రెండెకల వృద్ధి రేటు నమోదవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్టాక్ మార్కెట్లు భారీగా దూసుకెళ్లే దిశలో ఉన్నాయన్నారు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఆశాజనకంగా ఉండవచ్చునని చెప్పారు. రానున్న నాలుగైదేళ్లలో కొన్ని స్టాక్స్ ఆకట్టుకోలేకపోవచ్చునని, స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు ఆకర్షణీయంగా ఉండవచ్చునని చెప్పారు.

మార్కెట్ కరెక్షన్
సూచీలు ప్రస్తుతం దిద్దుబాటుకు గురవుతోన్న విషయం తెలిసిందే. ఈ అంశంపై రాకేష్ ఝున్‌ఝున్ వాలా స్పందిస్తూ... ఇది ఎంత కాలం కొనసాగుతుందనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. అలాగని, మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పలేమన్నారు. కరోనా కేసులు 2 లక్షలు దాటినప్పటికీ మార్కెట్లు మరీ భారీగా పతనమవుతున్న సందర్భాలు లేవని గుర్తు చేశారు. కరోనా మరీ అదుపులో లేకుండా పోయి రోజుకి ఆరు లక్షలకు పైగా కేసులు నమోదయితే గానీ మార్కెట్లు భారీగా పతనమయ్యే సూచనలు కనిపించడం లేదన్నారు.

మంచి రిటర్న్స్
భారత స్టాక్ మార్కెట్ చరిత్రను మలుపు తిప్పిన మూడు సందర్భాల్లో మార్చి 2020లో మార్కెట్లు కుప్పకూలడం కూడా ఒకటి అని రాకేష్ ఝున్‌ఝున్ వాలా అన్నారు. 1989లో కేంద్ర బడ్జెట్, సెప్టెంబర్ 11, 2001 తర్వాత మార్కెట్లు భారీగా పతనమయ్యాయని, అయినప్పటికీ ఆ తర్వాత మార్కెట్లు ఎలాంటి అవకాశాలు తెచ్చిపెట్టాయో మార్చి 2020 పతనం కూడా మంచి అవకాశాలను అందించిందని గుర్తు చేశారు. గత ఏడాది మార్చి నెలలో కొనుగోలు చేసిన దాదాపు అన్ని షేర్లు కూడా ఇప్పుడు రెండు నుండి మూడింతలు పెరిగాయన్నారు.

ఈ స్టాక్స్ భారీ వృద్ధి
రానున్న రోజుల్లో మెటల్ రంగం భారీగా లాభపడవచ్చునని రాకేష్ ఝున్‌ఝున్‌వాలా అంచనా వేశారు. మంచి అవకాశాలు ఉన్న రంగమన్నారు. గత పదేళ్లలో ఈ రంగంపై ఇన్వెస్టర్లు తీవ్ర నిర్లక్ష్యం వహించారన్నారు. సిమెంట్, మెటల్ రంగాల షేర్లలో భారీ వృద్ధి నమోదు కానుందని వ్యాఖ్యానించారు.
More From GoodReturns

ఈస్టర్ 2026: గుడ్ ఫ్రైడే, పామ్ సండే, లెంట్ తేదీల పూర్తి వివరాలు ఇవిగో..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications