Bengaluru: ఒక్క ట్రైన్‌తో క్లియర్ కానున్న రద్దీ.. బెంగళూరు నుంచి అస్సాం వరకు స్పెషల్ ట్రైన్.. స్టాప్స్ ఇవే..
ఐటీ హబ్ బెంగళూరు (Bengaluru) నుంచి సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ ఒక తీపి కబురు అందించింది. ప్రస్తుతం నగరంలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరగడంతో, అందరికీ రైలు టికెట్లు దొరకడం కష్టంగా మారింది. ఈ ఎక్స్‌ట్రా రద్దీని తగ్గించడానికి రైల్వే అధికారులు బెంగళూరు నుంచి అస్సాంలోని దిబ్రూగఢ్‌కు ఒక వన్-వే స్పెషల్ ట్రైన్‌ను (ట్రైన్ నం. 06573) ప్రకటించారు.

ట్రైన్ షెడ్యూల్ , టైమింగ్స్
ఈ స్పెషల్ ట్రైన్ బెంగళూరు (Bengaluru) లోని SMVT స్టేషన్ నుంచి సోమవారం (ఏప్రిల్ 27, 2026) రాత్రి 11:00 గంటలకు బయలుదేరుతుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైలును ఆంధ్రప్రదేశ్ , ఒడిశా మీదుగా నడుపుతున్నారు. ఇది మంగళవారం రాత్రి 9:05 గంటలకు విశాఖపట్నం సమీపంలోని కొత్తవలస స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి విజయనగరం (రా. 9:45), శ్రీకాకుళం రోడ్ (రా. 10:45) స్టేషన్ల మీదుగా ప్రయాణించి, చివరికి గురువారం సాయంత్రం 4:30 గంటలకు దిబ్రూగఢ్ చేరుకుంటుంది.
ముఖ్యమైన స్టాపింగ్స్ ఎక్కడంటే?
బతూర్పు తీర రైల్వే పరిధిలో ఈ రైలుకు కీలకమైన స్టాపింగ్స్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం, పలాస స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. అటు తర్వాత ఒడిశాలోని బ్రహ్మపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, , భద్రక్ స్టేషన్ల మీదుగా ఈ స్పెషల్ సర్వీస్ కొనసాగుతుంది. దీనివల్ల ఉత్తరాంధ్ర , ఒడిశా వెళ్లే ప్రయాణికులకు కూడా చాలా ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా బెంగళూరు (Bengaluru) లో ఉద్యోగాలు చేసే ఉత్తరాది ప్రజలకు ఇది పెద్ద వరం అని చెప్పవచ్చు.
కోచ్‌ల వివరాలు ఇవే!
ఈ ప్రత్యేక రైలులో మొత్తం 18 కోచ్‌లు ఉంటాయి. ప్రయాణికుల బడ్జెట్‌ను బట్టి వివిధ కేటగిరీలను అందుబాటులో ఉంచారు..
- 3rd AC కోచ్‌లు: 3
- స్లీపర్ క్లాస్: 5
- జనరల్ సెకండ్ క్లాస్: 8
- గార్డ్/దివ్యాంగుల కోచ్‌లు: 2
మధ్యతరగతి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఎక్కువ సంఖ్యలో జనరల్ , స్లీపర్ కోచ్‌లను ఏర్పాటు చేయడం విశేషం. బెంగళూరు నుంచి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే వారికి ఈ వన్-వే సర్వీస్ ఎంతో రిలీఫ్ ఇస్తుంది.
ప్రయాణికులు గమనించాల్సిన విషయం
సాధారణంగా వేసవి కాలం లేదా సెలవుల సమయంలో బెంగళూరు (Bengaluru) నుంచి అన్ని రైళ్లు వెయిటింగ్ లిస్ట్‌తో నిండిపోతుంటాయి. తత్కాల్‌లో కూడా టికెట్లు దొరకని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సమయంలో రైల్వే శాఖ ప్రకటించిన ఈ 06573 స్పెషల్ ట్రైన్ సదుపాయాన్ని ప్రయాణికులు ఉపయోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. మీరు కూడా ఈ రూట్‌లో ప్రయాణించాలనుకుంటే వెంటనే ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్‌లో గానీ లేదా స్టేషన్ కౌంటర్లలో గానీ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇది కేవలం వన్-వే సర్వీస్ మాత్రమే, అంటే బెంగళూరు నుంచి దిబ్రూగఢ్‌కు మాత్రమే వెళ్తుంది. కాబట్టి ప్రయాణానికి ముందే ప్లాన్ చేసుకోండి!


Click it and Unblock the Notifications