మీరు రైలులో ప్రయాణికులా.. అయితే మీకు అలర్ట్.. ఈరోజు ఆన్‌లైన్ మోడ్‌లో టికెట్ బుక్ చేసుకోవడంలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కోల్‌కతాకు చెందిన ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పిఆర్‌ఎస్) డేటా సెంటర్‌లో డౌన్‌టైమ్ యాక్టివిటీని అనుసరించి ఆన్ లైన్ టికెట్ బుక్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. PRS మూడు గంటల 45 నిమిషాల పాటు మూసివేయనున్నారు.
జూలై 08, 2023 శనివారం 23:45 గంటల నుంచి జూలై 09, 2023 ఆదివారం ఉదయం 03:30 గంటల మధ్య ప్రయాణికులు తమ టిక్కెట్‌ను ఇంటర్నెట్ మోడ్ ద్వారా బుక్ చేసుకోలేరు. షట్ డౌన్ కార్యకలాపాలు అనేక రాష్ట్రాలపై ప్రభావం చూపుతాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, జార్ఖండ్, అస్సాం, సిక్కిం, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల వారు ఆన్ లైన్ టికెట్ బుకింగ్ లో ఇబ్బందులో పడొచ్చు.

షట్ డౌన్ తూర్పు రైల్వే (ER), సౌత్ ఈస్టర్న్ రైల్వే (SER), ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR), సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR), ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే (NFR), ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ECR) జోన్‌లపై ప్రభావం చూపుతుంది.ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) మూసివేయడంతో ఇంటర్నెట్ బుకింగ్, కరెంట్ బుకింగ్, విచారణలు, చార్టింగ్ ఇతర అనుబంధ సేవలు ప్రభావితం అవుతాయి.
అయితే, ప్రయాణీకులు UTS మొబైల్ అప్లికేషన్ నుంచి సబర్బన్, నాన్-సబర్బన్ (లోకల్) రైళ్ల టిక్కెట్లను కొనుగోలు చేయ్యొచ్చు. రైల్వే స్టేషన్లలోని టికెట్ కౌంటర్ల నుంచి కూడా వారు కొనుగోలు చేయవచ్చు. జూలై 07, 2023 నుంచి జూలై 09, 2023 వరకు ప్రణాళికాబద్ధమైన నాలుగు గంటల ట్రాఫిక్ బ్లాక్ కారణంగా పలు రైళ్లు ఆసల్యంగా నడవనున్నాయి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications