తన పదునైన వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకునే ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ సభ్యుడు Raghav Chadha మరోసారి పార్లమెంట్ లో తన గళాన్ని లేవనెత్తారు. సోమవారం సాధారణ భారతీయులు ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సమస్యలను పార్లమెంట్ వేదికగా వెలుగులోకి తెచ్చారు. వాటి కోసం ప్రభుత్వాన్ని నిర్మాణాత్మక మార్పులు చేపట్టాలని కోరారు. ఆయన ప్రతిపాదించిన అంశాలలో మొదటగా.. దంపతులు ఐచ్ఛికంగా ఉమ్మడి ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి అవకాశం కల్పించాలని సూచించారు.
రాజ్యసభలో బడ్జెట్ సమావేశపు చర్చ సందర్భంగా రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. ప్రస్తుతం భారతదేశంలో భార్యాభర్తలు వేరుగా పన్ను చెల్లించాలి అని ఉండటంతో.. ఎక్కువ సంపాదించే భాగస్వామి అధిక పన్ను చెల్లించాల్సి వస్తోంది. అమెరికా, జర్మనీ వంటి దేశాల్లో దంపతులు ఆదాయాన్ని కలిపి పన్ను లెక్కింపులో ఉపయోగించుకుంటున్నారని.. భారతదేశంలో కూడా ఐచ్ఛిక ఉమ్మడి ఫైలింగ్ వల్ల కుటుంబాలపై పన్ను భారం తగ్గి, సమానమైన విధానాన్ని పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. వివిధ రకాల ఆదాయాలు కలిగిన పెళ్లైన జంటలు నష్టపోకుండా ఉండేందుకు.. ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఇద్దరూ కలిసి ఉమ్మడిగా దాఖలు చేయడానికి అనుమతించాలనేదే మొదటి ఆందోళన అని చద్దా వివరించారు.

రెండవ అంశం ఏంటంటే.. గాయపడిన సైనికులకు ఇచ్చే వైకల్య పింఛన్లపై పన్ను మినహాయింపును పునరుద్ధరించడం. ఇటీవల ఏర్పడిన విధాన ప్రకారం..అనారోగ్యంతో సేవ నుండి వైదొలిగిన సైనికులకే పూర్తి మినహాయింపు ఉంది. అయితే, గాయపడినప్పటికీ సేవ కొనసాగించిన సైనికులు లేదా పదవీ విరమణ చేసిన వారు పన్ను చెల్లించాల్సి వస్తోంది. ఇది సైనికులకు అన్యాయం, నిరుత్సాహం కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు. ఆయన ప్రభుత్వాన్ని గాయపడిన అందరు సైనికులకు 100 శాతం పన్ను మినహాయింపును కల్పించాలని కోరారు.
మూడవ అంశం ఏంటంటే.. బ్యాంకులు ఖాతాదారుల కనీస నిల్వ (Minimum Balance) పాటించకపోవడంపై విధించే జరిమానాలు. చద్దా వివరించినట్లుగా, పట్టణ, సెమీ-అర్బన్, గ్రామీణ శాఖలలో ఖాతాదారులు కనీస నిల్వను మించకపోవడంపై నెలకు రూ. 50 నుండి 600 వరకు జరిమానాలు చెల్లిస్తారు. అందువల్ల పేద, మధ్యతరగతి ప్రజలు భారంలో పడుతున్నారు. ఈ జరిమానాలు ఆర్థిక సమ్మిళిత లక్ష్యానికి విరుద్ధంగా ఉంటాయి. చిన్న పొదుపులను బ్యాంకింగ్ వ్యవస్థలో చేరకుండా నిరుత్సాహపరుస్తాయి. ఈ జరిమానాలను పూర్తిగా రద్దు చేసి, పేదలను ఆర్థిక వ్యవస్థలో చేర్చడం అత్యవసరమని పేర్కొన్నారు.
తన ప్రసంగం ముగింపులో.. రాఘవ్ చద్దా మూడు ముఖ్యమైన ప్రతిపాదనలతో: దంపతులకు ఐచ్ఛిక ఉమ్మడి పన్ను ఫిల్లింగ్, గాయపడిన సైనికుల పింఛన్లపై పూర్తి పన్ను మినహాయింపు, కనీస బ్యాలెన్స్ జరిమానాలను రద్దు చేయడం.. ప్రభుత్వాన్ని పౌరుల కోసం మరింత సమాన, మానవతా దృక్పథంతో వ్యవస్థను మార్పు చేయాలని ఆకర్షించారు.


Click it and Unblock the Notifications