Qatar Jobs: గల్ఫ్ కార్మికుల వెతలు.. జీతం అడిగితే స్వదేశానికి పంపివేత.. దోహాలో దారుణ ఘటన..
Qatar Jobs: గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు చేసేందుకు చాలా మంది భారత్ లోని అనేక రాష్ట్రాల నుంచి వెళుతుంటారు. అయితే అక్కడ జరిగే మోసాలు, అక్కడ మనవారు ఎదుర్కొనే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. జీతాలు చెల్లించకపోవటం, బానిసల్లా చూడటం, శారీరికంగా వాడుకోవటం వంటి సంఘటనలు జరగుతున్నాయనే వార్తలు నిత్యం వింటూనే ఉంటాం. ఈసారి అక్కడ వ్యవహారం ఆందోళనల దాకా వెళ్లింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మీరూ అర్థం చేసుకోండి.

దోహా దుస్థితి..
ఖతార్ రాజధాని దోహాలో జీతాల బకాయిల కోసం ఆందోళన చేస్తున్న కార్మికులను ఖతార్ ప్రభుత్వం వెనక్కి పంపింది. గల్ఫ్ దేశాల్లోని కంపెనీలు తగిన సౌకర్యాలు కల్పించకపోవడం, వలస కార్మికులకు లేదా విదేశీ కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించకపోవడం అనే సమస్య చాలా ఏళ్లుగా వేధిస్తోంది. గల్ఫ్ దేశాలకు పనికి వెళ్లిన వేలాది మందిలో కొందరు మంచి ఆదాయాన్ని ఆర్జిస్తుండగా.. మరికొందరి జీవితాలు మాత్రం దుర్భరంగా మారాయి.

ఫుట్‌బాల్ ప్రపంచ కప్..
నవంబర్- 2022 నుంచి జరగనున్న ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌కు ముందు వేతనాల కోసం కార్మికులు ఆందోళనలు, నిరసనలు చేపట్టడంపై ఖతార్ ప్రభుత్వం ఆగ్రహానికి గురైంది. దీంతో వారిని అణచివేత చర్యలు చేపట్టింది. నిరసన తెలిపినందుకు ఖతార్ ప్రభుత్వం భారతీయ వలస కార్మికులను తమదేశం నుంచి బహిష్కరించడం ద్వారా వారిని షాక్ ఇచ్చింది.

ఏడు నెలలుగా నో శాలరీస్..
తమకు ఏడు నెలలుగా జీతాలు చెల్లించటం లేదంటూ.. ఈ నెల ప్రారంభంలో ఖతార్ రాజధాని దోహాలో 60 మందికి పైగా కార్మికులు నిరసన తెలిపారు. ఈ నిరసనలో భారతీయులే కాకుండా ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు. హాలోని అల్ బండారీ కంపెనీ కంపెనీ బయట వీరి నిరసనతో ట్రాఫిక్‌ను నిలిపివేసినట్లు లండన్‌కు చెందిన కార్మిక హక్కుల ప్రచార సంస్థ ఈక్విడెమ్ వెల్లడించింది.

భారత్ తో పాటు..
నిరసనల్లో భారత్, నేపాల్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఫిలిప్పీన్స్‌కు చెందిన కార్మికులు ఉన్నారు. వలసదారుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించినందుకు ఖతార్ ప్రభుత్వం ఎదురుదెబ్బను ఎదుర్కొంటున్నందున, ఆగస్టు 14 నిరసనలో పాల్గొన్న కొంతమంది కార్మికులను స్వదేశానికి పంపినట్లు ప్రకటించింది. కానీ వారి వివరాలను మాత్రం వెల్లడించలేదు.

కార్మికుల మరణాలు..
బతుకు జీవుడా అంటూ పొట్టచేతపట్టుకునే గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికుల మరణాల విషయంలోనూ చివరికి అన్యాయమే జరుగుతోంది. వలస కార్మికుల మరణాలను ఖతార్ ప్రభుత్వం తక్కువగా చూపుతోంది. ఖతార్ కంపెనీలు కార్మికులను కఠినమైన పరిస్థితుల్లో ఉంచడం, వారి శ్రమకు ఫలితంగా చెల్లించాల్సిన జీతాలను ఇవ్వకపోవటం పట్ల తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications