TCS లాభాల్లో క్షీణత, క్వార్టర్ 4లో రూ.8,49 కోట్లు, ముందు గడ్డుకాలం
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) గత ఆర్థిక ఏడాదికి సంబంధించి మార్చితో ముగిసిన క్వార్టర్‌లో ఏకీకృత ప్రాతిపదికన రూ.8,049 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో నికర లాభం రూ.8,126 కోట్లుగా ఉండగా, ఈసారి స్వల్పంగా తగ్గింది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం రాబడులు మాత్రం 5.1% వృద్ధి చెంది రూ.38,010 కోట్ల నుంచి రూ.39,946 కోట్లకు చేరుకుంది. దీంతో రెవెన్యూ 3% పెరిగింది.
సైన్స్ అండ్ హెల్త్ కేర్‌లో 16.2 శాతం కమ్యూనికేషన్ అండ్ మీడియా రంగంలో 9.3 శాతం, తయారీ రంగంలో 7 శాతం, రిటైల్ అండ్ సీపీజీ సెగ్మెంట్‌లో 4.2 శాతం టెక్నాలజీ అండ్ సర్వీసెస్‌లో 3.5 శాతం రవెన్యూ వృద్ధిని నమోదు చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ రెవెన్యూలో 1.3% క్షీణత నమోదు చేసింది. మార్చితో ముగిసిన 2019-20 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రాబడి 7.1% పెరిగి రూ.1,56,949 కోట్లకు చేరుకుంది. నికర లాభం 2.8% వృద్ధి చెంది రూ.32,340 కోట్లుగా నమోదయింది.

రూపాయి ముఖ విలువ కలిగిని ప్రతి షేరుకు రూ.6 తుది డివిడెండ్‌ను బోర్డు ప్రతిపాదించింది. కరోనా కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) రెండు త్రైమాసికాల్లో గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొనే అవకాశముందని, అలాగే నిర్వహణపరంగా సవాళ్లు ఎదుర్కొవచ్చని అంచనా వేస్తున్నట్లు టీసీఎస్ తెలిపింది.


Click it and Unblock the Notifications