Q1 GDP: అందుకే జీడీపీ వృద్ధి రేటు భారీ జంప్

FY22 మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో భారత జీడీపీ వృద్ధి రేటు 20.1 శాతంగా నమోదయింది. గత ఏడాది (FY21)లో ఇదే త్రైమాసికంలో మైనస్ 23.9 నమోదయింది. అప్పుడు కరోనా, లాక్ డౌన్ ఆంక్షలతో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. జీడీపీ వృద్ధి రేటు అదరగొట్టినప్పటికీ కరోనా ముందుస్థాయికి మాత్రం ఆర్థిక వ్యవస్థ ఇంకా రాలేదు. అయితే వేగంగా వృద్ధి సాధిస్తున్న దేశం మాత్రం మనదే కావడం గమనార్హం. ఏడాది క్రితం ఇదే కాలం నాటి తక్కువ ప్రాతిపదిక, తయారీ, సేవల రంగాలు పుంజుకోవడం ఇందుకు కలిసి వచ్చినట్లు జాతీయ గణక కార్యాలయం (NSO) గణాంకాలు వెల్లడించాయి.

తాజా గణాంకాలతో ఈ ఏడాది ప్రపంచంలో వేగంగా వృద్ధి సాధిస్తోన్న దేశంగా భారత్ నిలుస్తోంది. అప్పట్లో కరోనా నియంత్రణకు దేశవ్యాప్త లాక్ డౌన్ విధించడం ఆర్థిక వ్యవస్థ పతనానికి కారణమైంది. 2020-21 మార్చి త్రైమాసికంలో వృద్ధి 1.6 శాతంగా ఉంది. వ్యాల్యూ పరంగా చూస్తే ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ రూ.32,38,020 కోట్లుగా నమోదయింది. 2019-20 ఇదే కాలంలో జీడీపీ వ్యాల్యూ రూ.35,66,708 కోట్లుగా ఉంది. 2020 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ రూ.26,95,421 కోట్లకు పడిపోయింది.

 Q1 GDP: Manufacturing sector the bright spot, real GDP still below pre Covid level

వార్షిక ప్రాతిపదికన వృద్ధి పుంజుకుంది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే 16.9 శాతం తగ్గింది. 2019 ఏప్రిల్-జూన్ త్రైమాసికంతో పోల్చినా 9.2 శాతం తక్కువ. 2020 జనవరి-మార్చి త్రైమాసికానికి జీడీపీ వృద్ధి 1.6 శాతంగా నమోదయింది. గత ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికం మినహా వరుసగా మూడు త్రైమాసికాల పాటు జీడీపీ వృద్ధి రేటు పెరుగుతూ వచ్చింది. FY22 తొలి త్రైమాసికానికి వ్యాల్యూ జోడింపు(GVA) వార్షిక ప్రాతిపదికన 18.8 శాతం వృద్ధి కనబరిచినప్పటికీ త్రైమాసికం ప్రాతిపదికన మైనస్ 13.3 శాతానికి క్షీణించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి భారీ వృద్ధి నమోదవడానికి తయారీ రంగం ప్రధాన కారణం. వార్షిక ప్రాతిపదికన దాదాపు 50 శాతం పుంజుకుంది. నిర్మాణ రంగం 68.3 శాతం, వర్తకం, హోటల్స్, కమ్యూనికేషన్ సేవల రంగాలు 34.3 శాతం, వ్యవసాయ రంగం 4.5 శాతం వృద్ధి చెందాయి. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం నుండి ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకున్నప్పటికీ, వ్యవసాయ రంగం మినహా మిగతా ఏ రంగం కరోనా సంక్షోభ పూర్వస్థాయికి చేరుకోలేదు.

తయారీ రంగ జీవీఏ 49.6 శాతానికి పెరగగా, 2020 ఇదే సమయంలో ఇది 36 శాతం క్షీణించింది. అంకెల్లో చూస్తే రూ.5.67 లక్షల కోట్ల నుండి రూ.5.43 లక్షల కోట్లకు చేరుకుంది. వ్యవసాయ రంగ జీవీఏ వృద్ధి 3.5 శాతం (రూ.4.49 లక్షల కోట్లు) నుండి 4.5 శాతానికి (రూ.4.86 లక్షల కోట్లు) చేరుకుంది.

కరోనా కారణంగా గత ఆర్థిక సంవత్సరం జిడీపీ వృద్ధి మైనస్ 7.3 శాతానికి పతనమైంది. గత ఏడాది ద్వితీయార్ధం నుంచి క్రమంగా పుంజుకుంటూ వచ్చిన ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో జోరందుకుంది. కానీ, ఏప్రిల్-మే కాలంలో కరోనా మళ్లీ పెరిగింది. అయితే, ఆర్థిక వ్యవస్థపై ఈసారి అంతగా ప్రభావం చూపలేదు. తక్కువ ఆంక్షలతో కూడిన స్థానిక లాక్‌డౌన్ విధించడంతో ఆర్థిక కార్యకలాపాలు పాక్షికంగా కొనసాగాయి. జూన్ నుండి కార్యకలాపాలు మళ్లీ పుంజుకోవడం వృద్ధి పెరుగుదలకు ఉపయోగపడింది. డెల్టా కేసులు పెరుగుతుండటం, కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సీన్ కార్యక్రమం మందకొడిగా సాగుతుండం ఆర్థిక పునరుద్ధరణను జాప్యం చేయవచ్చునని అంటున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+