Punjab National Bank Q4: దుమ్ము రేపిందిగా: నెట్ ప్రాఫిట్ స్కై హై
ముంబై: దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరస్తులు మేహుల్ చోక్సీ, నీరవ్ మోడీల కుంభకోణంతో మసక బారిన ప్రతిష్ఠను పునరుద్ధరించుకునే పనిలో పడింది పంజాబ్ నేషనల్ బ్యాంక్. వేల కోట్ల రూపాయల స్కాం చోటు చేసుకున్న ఈ బ్యాంక్.. అద్భుత పురోగతిని ప్రదర్శిస్తోంది. నికర ఆదాయంలో భారీ పెరుగుదలను నమోదు చేసింది. ఒకవంక బ్యాంక్ ఆఫ్ బరోడా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా నష్టాన్ని నమోదు చేసుకున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో దానికి భిన్నంగా 500 కోట్ల రూపాయలకు పైగా నెట్ ప్రాఫిట్‌ను ఆర్జించింది.

రూ.586 కోట్ల ప్రాఫిట్
ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ముగిసిన గత ఆర్థిక సంవత్సరం అంటే 2020-2021 చివరిదైన నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. ఈ మూడు నెలల కాలంలో ఆ బ్యాంకు నికర ఆదాయంలో 586 కోట్ల రూపాయల మేర వృద్ధి నమోదైంది. ఇదివరకటి ఆర్థిక సంవత్సరం అంటే.. 2019-2020లో ఇదే చివరి త్రైమాసికానికి బ్యాంకు 697 కోట్ల రూపాయల నికర నష్టాన్ని చవి చూసింది. సంవత్సరం తిరిగే సరికి ఆ సంఖ్య ప్లస్‌లోకి వచ్చేసింది. డిసెంబర్‌లో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలోనూ 506 కోట్ల ప్రాఫిట్ అందుకుంది పంజాబ్ నేషనల్ బ్యాంక్.

బ్యాంకు నికర వడ్డీ ఆదాయం ఓకే..
ఈ నెట్ ప్రాఫిట్ పెరుగుదల పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందినది మాత్రమే. ఇందులో విలీనమైన ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల లావాదేవీలను పరిగణనలోకి తీసుకోలేదు. బ్యాంకు నికర వడ్డీ ఆదాయం (నెట్ ఇంటరెస్ట్ ఇన్‌కమ్), చెల్లింపుల మధ్య 48.3 శాతం పెరుగుదల కనిపించింది. డిపాజిటర్లకు 48.3 శాతం మేర వడ్డీలను చెల్లించిందీ బ్యాంక్. దీని విలువ 6,938 కోట్ల రూపాయలు 6,938 మేర వడ్డీని డిపాజిట్లకు చెల్లించింది. 2019-2020 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఇది ఎక్కువే. ఇదివరకు చెల్లించిన వడ్డీ విలువ 4,677 కోట్ల రూపాయలు.

నిరర్థక ఆస్తుల్లో పెరుగుదల..
అదే సమయంలో నిరర్థకక ఆస్తులు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి 14.12 శాతం మేర నిరర్థక ఆస్తులు ఉన్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెల్లడించింది. మూడో త్రైమాసికంలో ఈ సంఖ్య12.99 శాతమే. అంటే మూడు నెలల వ్యవధిలో నిరర్థక ఆస్తులు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి రెండు త్రైమాసికల్లోనూ పెరుగుదల నమోదైంది. నికర నిరర్థక ఆస్తుల శాతం మొత్తంగా 5.73గా నమోదైనట్లు తెలిపింది.

22,531 కోట్ల ఆదాయం..
కాగా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 22,531 కోట్ల రూపాయల ఆదాయాన్ని నమోదు చేసినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెల్లడించింది. ఇదివరకటి ఆర్థిక సంవత్సరం అంటే 2021-2020 చివరి త్రైమాసికంతో పోల్చుకుంటే ఈ సంఖ్య చాలా ఎక్కువ. అప్పట్లో 16,388 కోట్ల రూపాయల ఆదాయాన్ని చవి చూసింది. ఏడాది తిరిగే సరికి ఈ సంఖ్య భారీగా పెరిగింది. కరోనా వైరస్ వల్ల ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల్లోనూల ఆశించిన స్థాయిలో బ్యాంక్ లావాదేవీలు నమోదయ్యాయని, సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత.. మరిన్ని సానుకూల ఫలితాలు వెలువడతాయని పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంచనా వేసింది.


Click it and Unblock the Notifications


