బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రైల్వే ఉద్యోగ నియామకాలకు సంబంధించిన సమస్యలపై నిరసనలు భారత్‌లో మొట్టమొదటి పెద్దస్థాయి నిరుద్యోగ అల్లర్లు కావొచ్చునని అంటున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో నిరసనలు చోటు చేసుకున్నాయి. దాదాపు పది మిలియన్ల దరఖాస్తులు రాగా, 40,000 ఉద్యోగాల ఆఫర్లు ఉండవచ్చునని అంచనా. ఈ నిరసనలు రాజకీయమా, కాదా అనే అంశం పక్కన పెడితే, విపక్షాలకు మాత్రం అధికార బీజేపీ పైన మాటల దాడికి ఉపయోగపడింది.
భారత్‌లో యువత ఎక్కువ. కానీ జాబ్ మార్కెట్ తక్కువగా ఉంది. 15 ఏళ్ల నుండి 24 ఏళ్ల జనాభాను పరిగణలోకి తీసుకుంటే ప్రపంచంలో భారత్ దారుణ కార్మిక మార్కెట్‌ను కలిగి ఉంది. దేశంలో 15 నుండి 24 ఏళ్ల జనాభాలో 27.4 శాతం జాబ్ మార్కెట్‌లో ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే ఇది తక్కువ. యువత నిరుద్యోగ రేటు భారత్‍లో అధికంగా ఉంది. ఇందుకు సంబంధించి గత పదిహేనేళ్లలో భారత్ పరిస్థితి దారుణంగా తయారయిందని టైమ్ సిరీస్ విశ్లేషణ వెల్లడిస్తోంది.

తక్కువ శ్రామికశక్తి భాగస్వామ్యం ఉన్నప్పటికి మన దేశంలో యువత అధిక నిరుద్యోగిత రేటుతో ఉంది. వివిధ దేశాల విషయానికి వస్తే భారత్‌లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్‌లో యువత నిరుద్యోగ శాతం 27.1 శాతంగా ఉంది. బంగ్లాదేశ్‌లో 42, చైనాలో 45.6 శాతం, అమెరికాలో 52.4 శాతం, బ్రెజిల్‌లో 56.6 శాతంగా ఉంది.
దేశంలో విద్యార్హత పెరుగుతున్నా కొద్ది నిరుద్యోగిత రేటు పెరుగుతోంది. నిరక్షరాస్యులు/బిలో ప్రైమరీ అయితే నిరుద్యోగిత రేటు 1.4 శాతం కాగా, 15-29 వయస్సులోని వారి నిరుద్యోగిత రేటు 7.4 శాతంగా ఉంది. ఇలా ప్రైమరీ/మిడిల్ స్కూల్ మొత్తం నిరుద్యోగిత రేటు 4.1 శాతం కాగా, 15-29 ఏళ్ల నిరుద్యోగిత రేటు 10.8 శాతం, సెకండరీ/హైయ్యర్ సెకండరీ మొత్తం నిరుద్యోగిత రేటు 7.1 శాతం కాగా, 15-29 ఏళ్ల నిరుద్యోగిత రేటు 16.4 శాతం, డిప్లోమా/సర్టిఫికెట్ కోర్స్ మొత్తం నిరుద్యోగిత రేటు 17.2 శాతం కాగా, 15-29 ఏళ్ల నిరుద్యోగిత రేటు 31.6 శాతం, గ్రాడ్యుయేట్ అండ్ ఎబౌ మొత్తం నిరుద్యోగిత రేటు 16.2 శాతం కాగా, 15-29 ఏళ్ల నిరుద్యోగిత రేటు 37.8 శాతంగా ఉంది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ (LFPR) 2018-19 ప్రకారం వేతనజీవుల సగటు నెల ఆదాయం రూ.16,160 కాగా, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ రూ.10,725, క్యాజువల్ వర్కర్స్ వేతనం రూ.8,340గా ఉంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్‌లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్‌లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications