Robert Kiyosaki: పొంచి ఉన్న నిశ్శ బ్ద సంక్షోభం.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక..!
ప్రముఖ ఇన్వెస్టర్, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఆయన ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం ఎదుర్కోబోయే తదుపరి ఆర్థిక సంక్షోభం గతంలో చూసిన రూపంలో ఉండబోదని అంచనా వేశారు. అది నిశ్శబ్దంగా ఆర్థికంగా ప్రజలను నలిపేస్తుందని హెచ్చరించారు. అందరూ తదుపరి ఆర్థిక సంక్షోభం 2008 నాటి పరిస్థితుల్లా ఉంటుందని భావిస్తున్నారని కానీ పరిస్థితి వేరే విధంగా ఉంటుందన్నారు. మార్కెట్లలో తీవ్ర భయాందోళనలు, రాత్రికి రాత్రే బ్యాంకులు మూతపడటం వంటివి చూస్తామని అనుకుంటున్నారని ఈ తదుపరి ఆర్థిక సంక్షోభం అలా ఉండదని పేర్కొన్నారు.
ఈ సంక్షోభం చాలా నిశ్శబ్దంగా వస్తుందని రాబర్ట్ కియోసాకి హెచ్చరించారు. ప్రజలు ఎక్కువ గంటలు పనిచేస్తున్నారని.. కాగితాలపై ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారని అన్నారు. కానీ ఆచరణలో మాత్రం మరింత వెనుకబడుపోతున్నారని విశ్లేషిస్తున్నారు. ఇది సాధారణ విషయం కాదని ఇదొక హెచ్చరిక సంకేతమని పేర్కొన్నారు. 60 శాతం మంది అమెరికన్లు ప్రతి నెలా వచ్చే జీతంపైనే ఆధారపడి జీవిస్తున్నారని గుర్తు చేశారు. ఆర్థిక వ్యవస్థ కూలిపోవడం లేదు, అది ఒత్తిడికి గురవుతోందని హెచ్చరించారు. ఆ భారాన్ని అప్పుల ద్వారా మోస్తున్నారని వివరించారు. క్రెడిట్ కార్డులు, 'బై నౌ పే లేటర్' ఆఫర్లు, స్టూడెంట్ లోన్లు, మినిమమ్ పేమెంట్లు సమస్యలను పరిష్కరించవని స్పష్టం చేశారు.

అందుకే ఈ సంక్షోభం నాటకీయంగా అనిపించదని అంచనా వేశారు. ఇది శాశ్వతమైన ఒత్తిడిలా, ఆర్థికంగా ఎటువంటి మిగులు లేని స్థితిలా మారుతుందని పేర్కొన్నారు. ప్రజలు భయపడటం లేదన్నారు. కానీ ఇది మరింత ప్రమాదకరమని అన్నారు. ఎందుకంటే ప్రజలు భయపడినప్పుడు తిరుగుబాటు చేస్తారని అంచనా వేశారు. కానీ అలసిపోయినప్పుడు వ్యవస్థకు లొంగిపోతారని విశ్లేషిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ కూలిపోవడానికి అలజడి అక్కర్లేదని... కోలుకునే అవకాశం లేకపోతే చాలన్నారు. పొదుపు పెరగదు, అప్పు తగ్గదన్నారు. కేవలం మీరు చేసే నిరంతర శ్రమకు ఫలితం తగ్గుతూ వస్తుందని హెచ్చరించారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications