Venu Swamy: బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. వేణు స్వామి హెచ్చరిక..!
ప్రజలందరూ వచ్చే సంవత్సరం జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణుడు వేణు స్వామి హెచ్చరించారు. ప్రపంచంలో ఆర్థిక పరిస్థితి దిగజారబోతుందని జోస్యం చెప్పారు. ఇప్పటికే చాలా దేశాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయని, ఇంకా తగ్గే అవకాశం ఉందని చెప్పారు. అందుకే ప్రజలందరూ సంవత్సరానికి సరిపడ డబ్బు, నిత్యావసరాలు, బియ్యం, ఆయిల్, పప్పులు, ఉప్పులు, పాల పొడి అన్ని సంవత్సరానికి సరిపడ సిద్ధం చేసుకోవాలని సూచించారు. అమెరికా ఆర్థిక పరిస్థితి దిగజారుతుందని తెలిపారు. పెట్టుబడిదారులు డబ్బును బయటకు తీయడం లేదని చెబుతున్నారు.
సాధారణ ప్రజలు డబ్బును పొదుపు చేయాలని కోరారు. వచ్చే సంవత్సరంలో సంచలనాలు జరగబోతున్నాయని జోస్యం చెప్పారు. సోషల్ మీడియాపై బతికే వారు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ పై ఆధారపడ్డవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. రాబోయే కాలంలో ఇందులో ఏదైనా ఆగిపోవచ్చని అన్నారు. విద్యుత్ ఉండదని, ఇంటర్ నెట్ కూడా రాదని వేణస్వామి తెలిపారు. భవిష్యత్ లో తాగడానికి నీరు కూడా ఉండదని హెచ్చరించారు. రాబోయే రెండు సంవత్సరాలు క్లిష్టంగా ఉండబోతున్నాయని అన్నారు. కొత్తగా ఎవరికి అప్పులు ఇవ్వకండని సూచించారు.

అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించవద్దని పేర్కొన్నారు. ఎవరిని నమ్మొద్దని చెప్పారు. రక్తసంబంధికులను కూడా నమ్మొద్దని పేర్కొన్నారు. డబ్బును అనవసరంగా వృథా చేయవద్దని కోరారు. ప్రపంచంలో ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయని హెచ్చరించారు. మన దేశంలో కూడా క్రమంగా పరిస్థితులు తారుమారు అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. డబ్బు సాయం కంటే తినడానికి తిండి పెట్టాండని చెప్పారు. వచ్చే రోజుల్లో దారుణ పరిస్థితులు రాబోతున్నట్లు వేణు స్వామి హెచ్చరించారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications