కాలేజ్ పూర్తి అయ్యాక పై చదువులకు ఫారెన్ వెళ్తుంటారు లేదా ఉద్యోగం కోసం లేదా అక్కడే ఉద్యోగంతో సెటిల్ అవ్వాలనుకుంటున్న ఈ రోజుల్లో ఓకే టెక్కీ చేసిన పోస్ట్ వింతగా అనిపించినా కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇండియాలో పెళ్లి చేసుకొని ఫారెన్ వెళ్లి పిల్లలు పుట్టాక కొన్నేళ్ళకు ఇండియాకి వచ్చిన వాళ్ళని చూస్తుంటాం కానీ దీనికి రివర్సులో అమెరికా నుండి ఇండియాకి వచ్చేయాలనుకుంటున్న ఓ టెక్కీ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అంతేకాదు ఇక్కడే ఉండేందుకు ఓ మంచి ఇల్లు రెంట్కి కావాలని కూడా కోరారు.

అమెరికాలో 13 సంవత్సరాలు పనిచేసిన ఒక ప్రొఫెషనల్ టెక్కీ, తన కుటుంబంతో కలిసి బెంగళూరుకు రావాలని యోచిస్తున్నానని, బెంగళూరులో నెలకు రూ.3.5 లక్షల అద్దెకు ఇల్లు కోసం వెతుకుతున్నానని పేర్కొంటూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చాలా మంది దృష్టిని ఆకర్షించింది.
ఈ టెక్కీ చేసిన రెడ్డిట్ పోస్టులో "నేను గత 13 సంవత్సరాలుగా USలో పనిచేస్తున్నాను. నా వయసు 39 సంవత్సరాలు, ఒత్తిడితో కూడిన ఉద్యోగం నుండి బయటపడి నా కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నాను. ఇందుకు అమెరికా నుండి బెంగళూరుకు వలస వెళ్లాలనుకుంటున్నానని చెప్పాడు.
తన భార్య, ముగ్గురు పిల్లలతో బెంగళూరుకు వెళ్లాలని యోచిస్తున్నానని, నెలకు 3.5 లక్షల రూపాయల అద్దెకు ఇల్లు కోసం వెతుకుతున్నానని చెప్పాడు. గత కొన్ని సంవత్సరాలుగా తాను ఎక్కువ సమయం పని, పని అంటూ పని మీదనే గడిపానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఇండియాకి వచ్చి ఉండడానికి నా దగ్గర డబ్బులు ఉన్నాయి. నా టెంపరరీ ఆదాయానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నాను, కాబట్టి నేను ఇండియాకి తిరిగి వచ్చి నా కుటుంబంతో సమయం గడపాలనుకుంటున్నాను" అని చెప్పాడు.
"ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకోవడం వల్ల నాకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ ప్రస్తుతం నేను, నా కుటుంబ సంతోషంగా ఉండడానికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను" అని తెలిపారు. అంతేకాదు వర్తూర్ ప్రాంతంలో 4 బెడ్ రూముల అపార్ట్ మెంట్ కోసం చూస్తున్నానని చెప్పాడు. బెంగుళూరు కాకపోయినా హైదరాబాద్ లేదా పూణే వంటి నగరాల్లో ఉండాడనికి కూడా తాను రెడీగా ఉన్నానని చెప్పారు.
"నా భార్య అమెరికాకు చెందినది, నా పిల్లలు ఫారెనర్స్'ల ఉంటారు, భారతీయ సమాజం, భారతీయ స్కూల్స్ వారిని ఎలా నిర్వహిస్తాయో నాకు కొంచెం గందరగోళంగా ఉంది. విదేశాల నుండి భారతదేశానికి వచ్చి ఉంటున్న మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు లేదా సమస్యలను నాకు చెప్పండి. మీ సూచనల కోసం నేను ఎదురు చూస్తున్నాను" అని అన్నారు.
ఈ పోస్టుకి ఒక యూజర్ అమెరికాలో ఉద్యోగం మానేసి భారతదేశానికి వచ్చే బదులు, అమెరికాలోని శివారు ప్రాంతంలో ఉండొచ్చని సూచించగా, నేను యూరప్ నుండి ఒక మహిళగా భారతదేశానికి వచ్చినప్పటి నుండి, ఇక్కడి ప్రజలు నన్ను చూసే విధానం చాలా వేరేల ఉంది. ఈ వ్యక్తులతో కలిసిపోవడం ఒక సవాలుగా ఉంది" అని ఆమె అన్నారు. ఇక్కడ ఉన్న సాంస్కృతిక పద్ధతులు మీ భార్య ఇంకా పిల్లలకు కొన్ని సమస్యలను కలిగించవచ్చు, కానీ అవి కొన్ని రోజుల్లో పరిష్కరమవుతాయి" అని మరొక యూజర్ అన్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications