పీఎం-కిసాన్(PM Kisan) యోజన కింద 15వ విడత మొత్తం రూ.18,000 కోట్లను బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. జార్ఖండ్‌లోని ఖుంటిలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ ద్వారా 80 మిలియన్ల రైతులకు రూ.18,000 కోట్లు పంపిణీ చేశారు. గత 14వ విడతలో జూలైలో దాదాపు 80.5 మిలియన్ల మంది రైతులు తమ బ్యాంకు ఖాతాల్లోకి రూ.17,000 కోట్లు జమ చేశారు. ఫిబ్రవరిలో 13వ విడతలో కర్ణాటకలోని బెలగావిలో దాదాపు 80 మిలియన్ల మంది రైతులకు ప్రధాని మోదీ 16,800 కోట్ల రూపాయలను పంపిణీ చేశారు.
PM-KISAN పథకం కింద 11వ మరియు 12వ వాయిదాలు కూడా మే, అక్టోబర్ 2022లో విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులను అండగా నిలవాలని 2019లో పీఎం కిసాన్ నిధి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ పథకం కింద రైతులకు నాలుగు నెలలకు ఒకసారి రూ. 2000 చొప్పున సంవత్సరానికి రూ.6000 రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 15 విడతలుగా రూ.28,000 రైతుల ఖాతాల్లో జమ చేసింది.

అయితే ఈకేవైసీ చేసుకున్న వారికే 15వ విడత డబ్బులు జమ అయ్యయాని అధికారులు తెలిపారు. ఈ కేవైసీ ఇప్పటికి చేసుకోకుంటే చేసుకోవాలని కోరుతున్నారు.
https://pmkisan.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈకేవైసీ చేసుకోవాలి. అందులో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, ఈ కేవైసీ, నో యూవర్ స్టేటస్ ఆప్షన్లు ఉంటాయి. అందులో ఈకేవైసీపై క్లిక్ చేయాలి. మీ ఆధార్ నంబర్ నమోదు చేయాలి. అప్పుడు మీ ఆధార్ నంబర్ లింక్ అయిన ఫోన్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని నమోదు చేస్తే మీ ఈకేవైసీ పూర్తవుతుంది. లేకుంటే మీ దగ్గరలోని మీ సేవ కేంద్రాలకు వెళ్లి కూడా ఈకేవైసీ చేసుకోవచ్చు.
ప్రభుత్వ ఉద్యోగాలు, టాక్స్ పేయర్స్, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు పీఎం కిసాన్ నిధి పథకానికి అనర్హులు. పీఎం కిసాన్ కింద డబ్బులు పడ్డాయో లేదో వెబ్ సైట్ కు వెళ్లి చూసుకోవచ్చు. ఎన్ని విడతులుగా డబ్బులు పడ్డాయో కూడా అందులో ఉంటుంది.


Click it and Unblock the Notifications