షాకింగ్: బంగారాన్ని కొనుగోలు చేయవచ్చా? కొన్నేళ్లలో రూ.2 లక్షలు దాటొచ్చు

గత ఏడాది ఆర్థిక మందగమనం కారణంగా, ఇప్పుడు కరోనా మహమ్మారి కారణంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో రూ.32వేలకు కాస్త అటు ఇటు చూసిన బంగారం ఇప్పుడు ఏకంగా రూ.47,000 మార్క్ దాటేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరుగుతూ వస్తోంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలడం, చమురు ధరలు ఓ సమయంలో జీరోకు పడిపోయిన నేపథ్యంలో ఇప్పుడు చాలామంది ఇన్వెస్టర్లు బంగారం బెస్ట్‌గా భావిస్తున్నారు.

దీర్ఘకాలంలో బంగారం బెట్టర్

దీర్ఘకాలంలో బంగారం బెట్టర్

కరోనా కారణంగా దాదాపు ఏ దేశ ఆర్థిక పరిస్థితి అయినా కోలుకోవడానికి ఆరు నెలల నుండి ఏడాది పడుతుందని అంచనా వేస్తున్నారు. అది కూడా మరో ఒకటి రెండు నెలల్లో కరోనా ప్రభావం తగ్గితే. ఈ ప్రభావం ఎంత కాలం ఉంటే ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి అంత ఆలస్యమవుతుంది. ప్రస్తుతం వివిధ దేశాలు ఆంక్షలు సడలిస్తున్నాయి. ఇది కాస్త ఊరట. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థకు కనీసం ఆరు నెలలు పడుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో బంగారం దీర్ఘకాలంలో మంచి పెట్టుబడిగా చెబుతున్నారు. కాబట్టి దీని వైపు చాలామంది ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు.

పెట్టుబడి మంచిదేనా?

పెట్టుబడి మంచిదేనా?

ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటే బంగారంపై రిటర్న్స్ ఆశించిన మేర ఉంటాయా? ఇప్పుడు పెరుగుతున్నంతగా బంగారం ధరలు పెరిగే అవకాశం లేదా అంటే ప్రస్తుతం ఏమీ చెప్పలేని పరిస్థితులు. కానీ దీర్ఘకాలంలో మాత్రం ప్రయోజనకరం. ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధర 10 గ్రాములకు రూ.50 వేల మార్క్ దాటే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణుల అంచనా. ఇటీవలి కాలంలోనే ధర కొద్దిగా తగ్గినప్పటికీ మళ్లీ భారీగా పెరుగుతోంది.

1800 డాలర్ల వద్ద కాస్త విరామం

1800 డాలర్ల వద్ద కాస్త విరామం

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఈ దశాబ్ద కాలంలో భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఔన్స్ 1800 డాలర్ల వద్ద కొంతకాలం ప్రతిఘటన ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ ధర వద్ద బంగారం కొంత విరామం చూడవచ్చు. అదే సమయంలో అది కొద్ది రోజుల్లో 2011 నాటి రికార్డ్ 1,923 డాలర్ల మార్క్‌ను అందుకోవచ్చునని చెబుతున్నారు. 2021 చివరి నాటికి బంగారం ధర 3,000 డాలర్లు మన కరెన్సీలో 85,000 మార్క్‌కు చేరుకోవచ్చునని గతంలోనే అంచనా వేశారు.

ఈక్విటీ, ఆయిల్ దెబ్బ.. బంగారం వైపు

ఈక్విటీ, ఆయిల్ దెబ్బ.. బంగారం వైపు

ఈక్విటీ మార్కెట్లు, చమురు మార్కెట్‌లో అస్థిరత కారణంగా బంగారం వైపు చూస్తున్నారని, ఇది ఇక ముందు కూడా ఇలాగే కొనసాగే అవకాశముందని నిపుణులు అంటున్నారు. మిగతా వాటి కంటే బంగారంలో పెట్టుబడి నష్టం ఉండదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఇక నుండి తమ పోర్ట్‌పోలియోలో ఈక్విటీ, చమురుతో పాటు బంగారానికి కేటాయింపు, అవసరమైతే వీటిని కాస్త పక్కన పెట్టి బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారు కూడా ఉంటారని చెబుతున్నారు.

ఈ దశాబ్దం చివరి నాటికి 10,000 డాలర్లు

ఈ దశాబ్దం చివరి నాటికి 10,000 డాలర్లు

రానున్న దశాబ్ద కాలంలో బంగారం ధరలు ఏ మేరకు పెరుగుతాయో తెలుసా? ఈ దశాబ్దం చివరి నాటికి పసిడి ఔన్స్ ధర 8,500 డాలర్ల నుండి 10,000 డాలర్లు లేదా అంతకు మించి పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణుల అంచనా. అంటే ఇది మన కరెన్సీలో కాస్త అటు ఇటుగా రూ.2 లక్షల నుండి రూ2.50 లక్షల వరకు ధర పలుకుతుందని అంచనా.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+