Praj industries: ప్రభుత్వ నిర్ణయంతో భారీగా పడిపోయిన ప్రజ్ ఇండస్ట్రీస్ షేర్లు..
దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షభావం కారణంగా ఈ సంవత్సరం చెరకు దిగుబడి తగ్గింది. దీంతో దేశీయంగా చక్కర కొరత ఏర్పడింది. దీంతో ప్రభుత్వం ఎగుమతులపై ఆంక్షాలు విధించింది. అయినప్పటికీ చక్కర కొరత కొనసాగడంతో చెరకు నుంచి ఇథనాల్ ఉత్పత్తిని అరికట్టాలని భావిస్తోంది. దీంతో చక్కర నుంచి ఇథనాల్ తయారు చేసే కంపెనీల షేర్లు పడిపోతున్నాయి. డిసెంబర్ 7న బల్రాంపూర్ చినీ మిల్స్, దాల్మియా భారత్ షుగర్, శ్రీ రేణుకా షుగర్స్, త్రివేణి ఇంజినీరింగ్, ప్రజ్ వంటి చక్కెర,ఇథనాల్ తయారీదారుల షేర్లు 3 శాతం వరకు క్షీణించాయి.
శుక్రవారం కూడా ప్రజ్ ఇండస్ట్రీస్ దాదా 8 శాతం నష్టపోయింది. 2023-24లో ఇథనాల్ ఉత్పత్తికి చెరకు రసం లేదా చక్కెర సిరప్‌ను ఉపయోగించకుండా ఉండాలని అన్ని చక్కెర కర్మాగారాలు, డిస్టిలరీలను ఆదేశిస్తూ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది."బి-హెవీ మొలాసిస్ నుండి OMCలు (చమురు మార్కెటింగ్ కంపెనీలు) అందుకున్న ప్రస్తుత ఆఫర్ల నుంచిఇథనాల్ సరఫరా కొనసాగుతుంది" వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

"గత త్రైమాసికాల్లో ఇథనాల్‌లోకి మళ్లించడం చాలా అర్థవంతంగా ఉంది. చక్కర కంపెనీలకు మార్జిన్ అక్రెటివ్ ఉంది. ఇథనాల్ సేకరణలో మందగమనం ఉన్నందున అటువంటి అభివృద్ధి చక్కెర కంపెనీలకు మంచిది కాదు. OMCలు, దాని మార్జిన్‌లపై ప్రభావం చూపుతుంది" అని ఫిస్డమ్ రీసెర్చ్ హెడ్ నిరవ్ కర్కేరా తెలిపారు. అనేక చక్కెర కంపెనీలు తమ ఆదాయాల్లో గణనీయమైన వాటా కోసం ఇథనాల్ ఉత్పత్తిపై ఆధారపడతాయి.
ప్రజ్ ఇండస్ట్రీస్ భారతదేశంలో దేశీయ ఇథనాల్ తయారు చేయడంలో బలమైన అధిక వాటా కలిగి ఉంది. ప్రజ్ ఇండస్ట్రీస్ దాదాపు 60-65 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో, కంపెనీ తన ఆదాయంలో 75 శాతం బయో-ఎనర్జీ విభాగం నుండి ఉత్పత్తి చేసింది. ప్రభుత్వం నిర్ణయంతో ప్రజ్ ఇండస్ట్రీస్ స్టాక్ పై ఒత్తిడి కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications