Prem Ganapathy: రోడ్డు పక్కన చిరు దుకాణం నుంచి వ్యాపారవేత్తగా.. ప్రేమ్ గణపతి ప్రస్థానం..
అతను రోడ్డు పక్కన చిన్న ఫుడ్ వ్యాపారం ప్రారంభించాడు. మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత తన వ్యాపారాన్ని విస్తరించాడు. దోశ ప్లాజాను ఒక బ్రాండ్ గా సృష్టించి వ్యాపారవేత్తగా ఎదిగాడు. అతనే ప్రేమ్ గణపతి. ఓ చిన్న పట్టణంలో పేద కుటుంబంలో పుట్టిన ప్రేమ్.. స్థైర్యం, దృఢ సంకల్పంతో ముందుకెళ్లారు. ప్రేమ్ తన వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ విజయం సాధించాడు.
1980లో ప్రేణ్ గణపతి ఆహార పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. దక్షిణ భారతీయ వంటకం, దోస చుట్టూ కేంద్రీకృతమై ఉన్న ఒక ప్రత్యేక రెస్టారెంట్ చైన్ ను రూపొందించాడు. దాని దోశ ప్లాజా పెట్టాడు. దోసా ప్లాజా ప్రయాణం సఫిగా ఏం సాగలేదు. ప్రారంభంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ప్రేమ్ ఆర్థిక అవరోధాలు, కార్యాచరణ అడ్డంకులు అధికమించాడు. నాణ్యత, వినూత్న మెనూ ఆఫర్‌లుతో ముందుకెళ్లాడు. దోశ ప్లాజా విభిన్న రకాలు దోశలకు నిలయంగా మార్చాడు.

పరిశుభ్రత ప్రమాణాలు పాటించడం, స్థిరమైన నాణ్యతతో మంచి పేరు తెచ్చుకుంది దోశ ప్లాజా. ఆహార పరిశ్రమలో ప్రశంసలు అందుకుంది. దోస ప్లాజా విజయం వెనుక ఉన్న కీలకమైన అంశాలలో ఒకటి ప్రేమ్ మారుతున్న కాలానికి అనుగుణంగా, వినియోగదారుల ప్రాధాన్యతలను గుర్తించడం. మెనూ సాంప్రదాయ దోసెలు మాత్రమే కాకుండా ఫ్యూజన్ క్రియేషన్‌లను తీసుకొచ్చాడు. దోశ ప్లాజా వ్యవస్థాపకుడిగా ప్రేమ్ గణపతి చేసిన కృషి అచంచలమైన స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తుంది.
ప్రేమ్ గణపతి ప్రయాణం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రేరణగా ఉపయోగపడుతుంది. దోశ ప్లాజా విజయం దక్షిణ భారత వంటకాల అవగాహనను విప్లవాత్మకంగా మార్చడమే కాకుండా భారతీయ ఫాస్ట్ ఫుడ్ పరిశ్రమ వృద్ధికి దోహదపడింది. చిరు వ్యాపారం నుంచి వ్యాపారవేత్తగా మారిన ప్రేమ్ అందరికి ఆదర్శమే.


Click it and Unblock the Notifications