Mid And Small Cap Stock: మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీ స్టాక్స్ పడిపోవచ్చు.. ప్రశాంత్ ఖేమ్కా
స్మాల్‌క్యాప్ కంపెనీల్లోని కొన్ని విభాగాలు వాల్యుయేషన్‌లో అధికంగా ఉన్నాయని వైట్‌ఓక్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ MD, వ్యవస్థాపకుడు ప్రశాంత్ ఖేమ్కా తెలిపారు. వాటి ధరలు ఏదో ఒక సమయంలో తగ్గే అవకాశం ఉందని హెచ్చరించారు. తయారీ, విద్యుత్, రక్షణ రంగాలలో కొన్ని సైక్లికల్, దేశీయ-ఆధారిత స్టాక్‌ల ధరలు అధికంగా ఉన్నాయని ఖేమ్కా చెప్పారు. గత 5 నెలల్లో చిన్న, మిడ్‌క్యాప్ స్టాక్‌లు ఏక దిశలో పెరిగాయని ఖేమ్కా వివరించారు.
మార్చి 28 నుంచి నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 44.70 శాతం పెరిగింది. అదే సమయంలో నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 37.39 శాతం వృద్ధి చెందింది. సెప్టెంబర్ 12న నిఫ్టీ స్మాల్‌క్యాప్ 4.1 శాతం క్షీణించగా, నిఫ్టీ మిడ్‌క్యాప్ 3.07 శాతం క్షీణించింది. "భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో, వచ్చే నెల, వచ్చే వారం, వచ్చే ఏడాదిలో ఇవి పడే అవకాశం ఉందన్నారు. గత 4 నుంచి 6 నెలల్లో కొన్ని స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ షేర్లు 100 నుంచి 300 శాతం లాభపడ్డాయని వివరించారు.

కొన్ని స్టాక్‌లు 50 నుంచి 75 శాతం వరకు తగ్గుముఖం పట్టవచ్చని ఆయన తెలిపారు. ఖేమ్కా స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్‌లోని రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలలో తగ్గుదల ఉండొచ్చని అంచనా వేశారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఉన్నప్పటికీ చాలా కంపెనీలు ఇప్పుడు కొనే విధంగా లేన్నారు. ధరలు అసాధారణ స్థాయికి విస్తరించాయని పేర్కొన్నారు. ప్రస్తుతం స్మాల్‌క్యాప్ కంపెనీలకు సంబంధించి కొన్ని కంపెనీలు కాలక్రమేణా బాగా రాణిస్తాయని ఆయన అన్నారు.
కానీ చాలా కంపెనీలు ఈ రోజు ఉన్న ధరల కంటే చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయని అంచనా వేశారు. లార్జ్-క్యాప్ కంపెనీలలో అలాంటి పరిస్థితి ఉండదన్నారు. నిఫ్టీ 50 గత 6 నెలల్లో 17.76 శాతం మాత్రమే పెరిగినట్లు గుర్తు చేశారు. స్మాల్, మిడ్ క్యాప్ స్టాకుల్లో ఒకేసారి కాకుండా సిప్ పద్ధతిలో పెట్టుబడి పెడితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి స్టాక్ ల్లో సిక్లికల్ ఉంటుందని పేర్కొన్నారు.
Note: ఈ సమాచారం కేవలం నిపుణుల అభిప్రాయం మాత్రమే. దీనికి గుడ్ రిటర్న్ తెలుగు బాధ్యత వహించదు.


Click it and Unblock the Notifications