ఆటో మొబైల్ పరిశ్రమకు గుడ్‌న్యూస్. కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్(GST) రేట్ కట్‌కు సంబంధించి శుక్రవారం హింట్ ఇచ్చారు. గతంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ టూ-వీలర్స్ పైన జీఎస్టీ రేటు తగ్గిస్తామని హింట్ ఇచ్చారు. ఇప్పుడు ఆటోమొబైల్ పరిశ్రమకు జవదేకర్ సంతోషం కలిగించే వార్తను చెప్పారు.
ఆటోమొబైల్ పరిశ్రమ త్వరలో శుభవార్త వినబోతుందని తెలిపారు. ఆయన ఈ రోజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. త్వరలో ఆటో పాలసీల విధానాన్ని సమీక్షించనున్నామని, షేర్ హోల్డర్స్ ఆటో పరిశ్రమ నిపుణుల సూచనలను అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. కాగా, ఆటోమొబైల్ పరిశ్రమలో జీఎస్టీ, ద్విచక్రవాహనాలు తదితర ప్రజారవాణా వాహనాలకు జీఎస్టీ పన్నుల విధానంలో సానుకూల నిర్ణయాలు ఉంటాయని కేంద్రవర్గాలు చెబుతున్నాయి.

అయితే తుది నిర్ణయం ఆర్థిక శాఖ అధ్యయనం తర్వాత ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం వాహనాలకు 28 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అన్ని రంగాలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
పది రోజుల క్రితం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(CII)తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా టూవీలర్లపై జీఎస్టీ భారం తగ్గింపుపై స్పందించారు. ద్విచక్ర వాహనాలు విలాసవంతమైన వస్తువులు కాదని, అలా అని హానికర వస్తువులు కూడా కాదని, కాబట్టి జీఎస్టీ రేట్ల సవరింపుకు అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రేట్ల సవరణ ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ పరిశీలించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. లగ్జరీ ఉత్పత్తులు, హానికరమైన వస్తువు కానీ టూవీలర్లపై ఎక్కువ జీఎస్టీ రేటు సరికాదని అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications