ఏడాదిలో భారీగా పెరిగిన ఆలు, ఉల్లి: ధరలు తగ్గుతాయా, ప్రభుత్వం ఏం చేస్తోంది?
గత ఏడాది కాలంలో గోదుమ మినహా మిగతా అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఈ కాలంలో అత్యధికంగా ఆలు ధరలు 92 శాతం, ఉల్లి ధరలు 44 శాతం పెరగడం గమనార్హం. కరోనా కారణంగా గత కొంతకాలంగా నిత్యావసరాల పైన ప్రభావం పడుతోంది. ధరలు వేగంగా పెరుగుతున్నాయని, అయితే ఇది తాత్కాలికమని, సరఫరా మెరుగుపడటంతో అది తగ్గుతుందన్నారు.

ఉల్లి, ఆలు, పప్పు ధరలు జంప్
కన్స్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ డేటా ప్రకారం సగటు టోకు ధరలు బంగాళదుంప ఏడాదిలో 108 శాతం పెరిగి క్వింటాల్ ధర రూ.1,739 నుండి రూ.3,633కు చేరుకుంది. హోల్‌సేల్ ఉల్ల ధరలు శనివారం క్వింటాల్‌కు రూ.5,645 పలికాయి. గత ఏడాదితో పోలిస్తే 47 శాతం పెరిగింది. వీటితో పాటు పప్పుధాన్యాలు కూడా పెరిగాయి. గత అయిదేళ్లలో రిటైల్ బంగాళాదుంప ధరలు 158 శాతం పెరిగి కిలో రూ.16.7 నుండి రూ.43కు చేరుకున్నాయి. ఉల్లితో పాటు బంగాళాదుంప ధరలకు కూడా చెక్ పెట్టవలసిన అవసరం ఉందని, ఇందుకోసం చర్యలు తీసుకోవాలని అంటున్నారు.

ధరలు తగ్గింపు కోసం ప్రభుత్వం చర్యలు
హోల్‌సేల్, రిటైల్ ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కూరగాయలు, మాంసం, చేపలు, పప్పుధాన్యాల పెరిగాయి. గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్భణం పరిమితికి మించి ఉంది. ఖరీఫ్ పంట వచ్చేవరకు టమోటా, ఉల్లి, బంగాళదుంప పైన ఒత్తిడి తగ్గదని చెబుతున్నారు. బంగాళాదుంప, ఉల్లి ధరల మధ్య వ్యత్యాసం ఉందని, ఉల్లి లభ్యత ఉన్నదని, కానీ ధరలపై కృత్రిమ పెరుగుదల కనిపిస్తోందని అంటున్నారు. ధరలు పెరుగుతుండటంతో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు.

ధరలు తగ్గించేలా చర్యలు
అదే సమయంలో ఈ సంవత్సరం బంగాళాదుంప పంట గణనీయంగా తగ్గింది. ఈ పంటను ఎక్కువగా ఉత్పత్తి చేసే ఉత్తర ప్రదేశ్‌లో 15.5 మిలియన్ టన్నుల నుండి 12.4 మిలియన్ టన్నులకు పడిపోయింది. రెండో అతిపెద్ద ఉత్పత్తిదారు పశ్చిమ బెంగాల్‌లో 11 మిలియన్ టన్నుల నుండి 8.5 మిలియన్ టన్నుల నుండి 9 మిలియన్ టన్నులకు పడిపోయింది. భూటాన్ నుండి దిగుమతులు పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. దిగుమతి నిబంధనలను కేంద్రం సడలించింది. వచ్చే ఏడాది జనవరి 31 నాటికి దిగుమతి చేసేలా ప్లాన్ చేస్తోంది. అదే సమయంలో 7000 టన్నుల ఉల్లి దిగుమతి అయింది. నవంబర్ 16వ తేదీ నాటికి మరో 25 వేల టన్నుల ఉల్లి రానుంది. నవంబర్ 20వ తేదీ నాటికి 15వేల టన్నుల ఎర్ర ఉల్లిని దిగుమతి చేసుకోవడానికి టెండర్లను ఆహ్వానించారు.


Click it and Unblock the Notifications