ఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పోస్టాఫీసు ఖాతాదారులకు బిగ్ రిలీఫ్. మీ ఖాతానుంచి ఇప్పటి వరకు రూ.5వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకునే వీలుండేది. ఇకపై వ్యక్తిగత ఖాతా నుంచి విత్‌డ్రా పరిమితిని రూ.20వేలకు పెంచుతామని పోస్టల్ శాఖ వెల్లడించింది. బ్యాంకులతో పాటు సమానంగా పోటీ పడేందుకే ఈ కొత్త పద్ధతిని ప్రవేశపెడుతున్నట్లు పోస్టల్ శాఖ వెల్లడించింది. విత్‌డ్రా పరిమితి పెంచడం ద్వారా పోస్టల్ శాఖలో కస్టమర్లు కూడా పెరగడమే కాకుండా ఖాతాలు కూడా తెరిచేందుకు ఆసక్తి కనబరుస్తారని పోస్టల్ శాఖ భావిస్తోంది.
పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాలపై విత్‌డ్రా పరిమితిని రూ.5వేల నుంచి రూ 20వేలకు పెంచడంపై హర్షం వ్యక్తం చేశారు ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు జితేంద్ర సోలంకి. పోస్టల్ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో డిపాజిట్ల వరద పారిస్తుందని చెప్పారు. గత కొన్నేళ్లుగా పోస్టల్ శాఖలో డిపాజిట్లు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయని చెప్పారు. కానీ ఇప్పుడు విత్‌డ్రా పరిమితిని రూ.20వేలకు పెంచడం ద్వారా చిన్న మొత్తాల పొదుపు ఖాతాలు పెరుగుతాయని అది కూడా బ్యాంకులతో సమానంగా ఉంటాయని జోస్యం చెప్పారు.

ప్రస్తుత రోజుల్లో బ్యాంకు సేవింగ్స్ ఖాతా కలిగి ఉండి,అతనికి బ్యాంకు కేటాయించిన డెబిట్ కార్డు ఆధారంగా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ వాస్తవానికి కొన్ని గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఎంల నుంచి ఒక ట్రాన్సాక్షన్ కింద రూ.10వేలు కంటే ఎక్కువగా క్యాష్ రావడం లేదు. అయితే పోస్టల్ శాఖలో విత్‌డ్రా పరిమితిని రూ.20వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఆర్థికంగా ఆక్సిజన్ అందించినట్లు అయ్యింది. అంతేకాదు కొత్త ఖాతాదారులు కూడా పోస్టాఫీసుల వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయని సోలంకి చెప్పారు. వివిధ పోస్టాఫీస్ పథకాల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇక ప్రస్తుత తరుణంలో చాలా బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలపై వచ్చే వడ్డీని తగ్గించేస్తుండగా.. పోస్టల్ శాఖ మాత్రం తమ సేవింగ్స్ ఖాతాదారులకు వడ్డీని ఏడాదికి 4శాతంగా ఉంచుతోంది. పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా నుంచి కనీసం విత్‌డ్రా పరిమితి రూ.50 ఉండగా... కొత్త ఖాతా తెరిచేందుకు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. ఇక పోస్టాఫీసులో మినిమం బ్యాలెన్స్ రూ.500 ఉండాల్సి ఉండగా.. ఆర్థిక సంవత్సరం ముగింపు వచ్చేసరికి కనీస బ్యాలెన్స్ లేకుంటే, అకౌంట్ మెయిన్‌టెనెన్స్ ఫీజు కింద రూ.100 కోత విధించబడుతుంది. అకౌంట్ బ్యాలెన్స్ సున్నాగా ఉంటే ఖాతాను క్లోజ్ చేయడం జరుగుతుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications