ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూయర్స్‌కు అండగా నిలిచేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నో చర్యలు తీసుకున్నారు. మోడీ ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు సాహసోపేతంగా తీసుకుంటోంది. అయోధ్య రామమందిరం, ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్, ఎన్ఆర్సీ వంటి అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకుంటోంది. అదే విధంగా, బిజినెస్ ఫ్రెండ్లీతో పాటు ఎంటర్‌ప్రెన్యూయర్స్ కోసం చర్యలు తీసుకుందని, కానీ ఇటీవలి కాలంలో రాజకీయ అంశాలపై దృష్టి సారించిన నేపథ్యంలో ఇలాంటి సంస్కరణలు అకస్మాత్తుగా ఆగిపోయాయని, ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ప్రముఖ ఫ్రెంచ్ ఆర్థికవేత్త గై సోర్మాన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు
ప్రస్తుతం దేశీయ, విదేశీ పెట్టుబడిదారులు... ఇద్దరు కూడా భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆందోళన చెందుతున్నారని సదరు ఆర్థికవేత్త గైసోర్మాన్ అన్నారు. Economics Does Not Lie: A Defence of the Free Market in a time of Crisis సహా ఎన్నో పుస్తకాలు రాశారు. ప్రస్తుతం భారత్‌లో ప్రొటెక్టిజం వైపు మొగ్గు చూపుతున్నారన్నారు.

తన అజెండాను హఠాత్తుగా పక్కన పెట్టి.. బ్యాడ్ నేమ్
ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభంలో ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూయర్స్‌కు ప్రోత్సాహమిచ్చే చర్యలు చేపట్టారని గై సోర్మాన్ అన్నారు. లైసెన్స్ రాజ్, అవినీతికి చెక్ చెప్పి, మేకిన్ ఇండియాను ప్రమోట్ చేయడం ద్వారా సరికొత్త నేషనల్ మార్కెట్‌ను క్రియేట్ చేసి అవకాశం కల్పించారన్నారు. కానీ హఠాత్తుగా దీనిని సగంలో ఆపివేసారన్నారు. ఆయన ఆ తర్వాత తన సొంత ఆర్థిక అజెండాను పక్కన పెట్టి, రాజకీయ అంశాలపై దృష్టి సారించారని, ఇది భారత్‌కు, మోడీ ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ తెచ్చిందన్నారు.

సిటిజెన్‌షిప్ లా నాకు సంబంధం లేదు కానీ...
మోడీ ప్రభుత్వం తీసుకువస్తున్న సిటిజెన్‌షిప్ లా వంటి వాటిని తాను జడ్జ్ చేయలేనని, అవి మంచి చేస్తాయా లేదా చెడు చేస్తాయా అనే అంశాలు తనకు సంబంధం లేదన్నారు. నేను చెప్పదలుచుకున్నది ఒక్కటేనని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన మందగమనంలో ఉందని, ఇలాంటి సమయంలో భారత్ వంటి ఆర్థిక వ్యవస్థ కూడా కీలకమని, ప్రస్తుత పరిస్థితి ఆర్థిక వ్యస్థపై నెగిటివ్ ప్రభావాన్ని ఇంపాక్ట్ కలిగిస్తుందన్నారు.

నివారించవచ్చు..
పెట్టుబడికి, విశ్వాసానికి మధ్య బలమైన సంబంధం ఉందని ఆర్థికవేత్తలు అందరూ అంగీకరిస్తున్నారు. దీనిపై గై సోర్మాన్ స్పందిస్తూ... ఈ నమ్మకం ప్రస్తుతం జాతీయస్థాయిలో క్షీణించిందన్నారు. ఇది చాలా బాధాకరమని, అయితే దీనిని నివారించే మార్గాలు ఉన్నాయని కూడా చెప్పారు. అలాగే, జీడీపీ రేటుపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications