PM Kisan Yojana: కిసాన్ యోజన డబుల్ ధమాకా! ఇకపై ఏడాదికి రూ. 12,000.. మీ పేరు ఉందో లేదో ఇలా చూసుకోండి!
PM Kisan Yojana: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం , కేంద్ర ప్రభుత్వం కలిసి రైతులకు ఒక భారీ శుభవార్తను అందించాయి. ఇప్పటివరకు అందుతున్న ఆర్థిక సాయాన్ని ఇప్పుడు ఏకంగా రెట్టింపు చేశారు. దీనివల్ల అర్హులైన రైతులకు ఏడాదికి మొత్తం రూ. 12,000 నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. ఇది రైతులకు ఒక గొప్ప అవకాశంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.

ఏయే పథకాల ద్వారా ఈ సాయం అందుతుంది?
రైతులకు ఈ రూ. 12,000 లబ్ధి ప్రధానంగా రెండు ముఖ్యమైన పథకాల కలయిక ద్వారా లభిస్తుంది:
- పిఎం కిసాన్ యోజన (PM Kisan yojana): ఈ కేంద్ర ప్రభుత్వ పథకం కింద ప్రతి ఏటా రైతులకు రూ. 6,000 అందుతాయి. వీటిని మూడు విడతల్లో (విడతకు రూ. 2,000 చొప్పున) నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా అందజేస్తారు.
- ముఖ్యమంత్రి కిసాన్ కళ్యాణ్ యోజన: గతంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకం కింద రూ. 4,000 అందజేసేది. కానీ ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ. 6,000కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
అంటే, కేంద్రం ఇచ్చే రూ. 6,000 , రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 6,000 కలిపి రైతు కుటుంబానికి ఏడాదికి రూ. 12,000 అందుతాయన్నమాట.
లబ్ధి పొందాలంటే ఈ నిబంధనలు పాటించాల్సిందే!
ఈ పథకాల ద్వారా నగదు మీ ఖాతాలోకి రావాలంటే కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయడం తప్పనిసరి. లేదంటే మీ ఇన్ స్టాల్ మెంట్స్ ఆగిపోయే ప్రమాదం ఉంది.
- e-KYC పూర్తి చేయాలి: ప్రతి రైతు తప్పనిసరిగా తమ ఈ-కేవైసీని పూర్తి చేయాలి. ఇది చేయకపోతే భవిష్యత్తులో వచ్చే డబ్బులు ఆగిపోతాయి.
- భూమి రికార్డుల వెరిఫికేషన్: మీ భూమి రికార్డులను డిజిటల్ పద్ధతిలో ధృవీకరించుకోవాలి.
- ఆధార్ లింక్: మీ బ్యాంకు ఖాతా ఖచ్చితంగా ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి.
- యాక్టివ్ అకౌంట్: మీ బ్యాంక్ ఖాతా చురుకుగా (Active) ఉండాలి, లావాదేవీలు జరుగుతూ ఉండాలి.
స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?
రైతులు తమ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం ఇప్పుడు చాలా సులభం. మీరు మీ గ్రామంలోని పట్వారీని (రెవెన్యూ అధికారి) సంప్రదించవచ్చు లేదా సమీపంలోని CSC (కామన్ సర్వీస్ సెంటర్) కి వెళ్లి మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో చూసుకోవచ్చు. ఒకసారి పోర్టల్‌లో రిజిస్టర్ అయి, అన్ని వివరాలు సరిగ్గా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వ సాయం ఆటోమేటిక్ గా మీ ఖాతాలో క్రెడిట్ అవుతుంది.
ముఖ్య గమనిక: కైవైసీ లేదా ఇతర కారణాల వల్ల బ్యాంకు ఖాతాల్లో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే సరిచేసుకోవాలి. ఈ ప్రభుత్వ పథకం (pm kisan yojana) ద్వారా వచ్చే సాయం చిన్న , సన్నకారు రైతులకు పెట్టుబడి ఖర్చుల కోసం ఎంతో ఆసరాగా నిలుస్తోంది.


Click it and Unblock the Notifications