రైతులకు సాయం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2019లో పీఎం కిసాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు భూమితో సంబంధం లేకుండా నాలుగు నెలకు రూ.2 వేల చొప్పును సంవత్సరానికి రూ.6 వేలు అందిస్తున్నారు. ఈ పథకం కింద ఇప్పటికే 12 విడతలుగా రూ.24 వేలను పంపిణీ చేశారు. త్వరలో 13 విడత డబ్బులు అన్నదాతల బ్యాంకు ఖాతాలో పడే అవకాశం ఉంది.

నరేంద్ర మోడీ
ప్రధానమంత్రి కిసాన్ యోజన 13వ విడత డబ్బులు బడ్జెట్‌కు ముందే విడుదల కావచ్చని వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ లోనే 13వ విడత విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు పైసాలు రాలేదు. 13వ విడతకు సంబంధించి జనవరి 29న ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం విడుదల తేదీని ప్రకటిస్తారని అనుకుంటున్నారు.

నిర్మలా సీతారామన్
ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి పీఎం కిసాన్ యోజన కింద ఇచ్చే డబ్బును పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతేకాకుండా రైతులకు ప్రత్యేకమైన ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈకేవైసీ
ఈ 13వ విడత డబ్బులు రావాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. ఈకేవైసీ చేయించుకోకుంటే పైసాలు ఖాతాలో జమ కావు. ఇప్పటికీ ఈకేవైసీ చేసుకోని రైతులు వెంటనే చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. PM కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్‌లోకి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతున్నారు. వెబ్ సైట్ ఓపెన్ చేయగానే ఎడమ వైపు ఈ కేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది.

ఆధార్ లింక్
దానిపై క్లిక్ చేసి ఆధార్ లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయాలి. తర్వాత ఆధార్ నెంబర్ నమోదు చేయాలి. అప్పుడు మళ్లీ ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి సడ్మిట్ చేస్తే ఈకేవైసీ ప్రక్రియ పూర్తయినట్లే. ఏమైనా సమస్యలు ఎదురైతే.. హెల్ప్‌లైన్ నంబర్ 155261 లేదా 1800115526 లేదా 011-23381092కు ఫోన్ చేయాలి.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications