ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 15వ విడత త్వరలో రైతుల ఖాతాల జమ అయ్యే అవకాశం ఉంది. ఈ పథకం కింది ఇప్పటి వరకు 14వ విడతలుగా రూ. 28000 అందజేశారు. ఇప్పుడు 15వ విడత కూడా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి పంపేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. అక్టోబర్ చివరలో లేదా నవంబర్ 15వ విడత పీఎం కిసాన్ నిధులు జమ జమ అయ్యే అవకాశం ఉంది.
పీఎం కిసాన్ 15వ విడతకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రధాన్ మంత్రి సమ్మాన్ నిధి యోజన గురించి మరింత సమాచారం కోసం, మీరు అధికారిక వెబ్‌సైట్ www.pmkisan.gov.inని కూడా సందర్శించవచ్చు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్రం 2019లో ప్రారంభించింది. దీని కింద ప్రతి సంవత్సరం రూ.6,000 మూడు విడతల్లో అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తారు.

ఒక్కో విడతలో రూ.2000 జమ చేస్తారు. అయితే ఈ కేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఇప్పటికీ కేవైసీ చేసుకోని వారుంటే.. చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. మీరు PM కిసాన్ యొక్క తదుపరి వాయిదాలను పొందాలనుకుంటే, e-KYC ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి. రైతులు తమ సమీప CSC కేంద్రాన్ని సందర్శించడం ద్వారా లేదా PM కిసాన్ పోర్టల్ pmkisan.gov.inని సందర్శించడం ద్వారా ఇ-కేవైసీ చేసుకోవచ్చు.
ఒక రైతు వ్యవసాయం చేస్తున్నా, పొలం అతని పేరు మీద లేకుంటే అతనికి ఈ పథకం వల్ల ప్రయోజనం ఉండదు. పొలం తన తండ్రి లేదా తాత పేరు మీద ఉన్నప్పటికీ, అతను ఈ పథకం ప్రయోజనాన్ని పొందలేడు. ఎవరైనా వ్యవసాయ భూమి యజమాని అయితే, అతను ప్రభుత్వ ఉద్యోగి లేదా పదవీ విరమణ చేసినట్లయితే, అతను కూడా ఈ పథకానికి అనర్హుడు. ప్రస్తుత లేదా మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రికి కూడా పీఎం కిసాన్ యోజన ప్రయోజనం ఉండదు.
ప్రొఫెషనల్ రిజిస్టర్డ్ డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు లేదా వారి కుటుంబ సభ్యులు కూడా అనర్హులు. రైతు అయినప్పటికీ, ఎవరైనా నెలకు రూ. 10,000 కంటే ఎక్కువ పింఛను పొందినట్లయితే, అతను ఈ పథకం లబ్ధిదారుడు కాలేడు. ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు, రైతులు వారి అర్హతను తనిఖీ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత, అర్హులని గుర్తించినట్లయితే, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు ప్రయోజనాలు అందిస్తారు. ఇప్పటి వరకు 14వ విడత రైతులకు అందింది. ప్రభుత్వం 14వ విడత మొత్తాన్ని 27 జూలై 2023న విడుదల చేసింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications