పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం 14వ విడతను మోడీ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రభుత్వం రైతులకు ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తోంది. ఈ పథకం ద్వారా మోడీ ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు మేలు చేస్తోంది. రాజస్థాన్‌లోని సికార్‌కు చెందిన 8.5 కోట్ల మంది రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ 14వ విడత విడుదల చేశారు.
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PMKSN) రైతులకు సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక సహాయం అందిస్తున్నారు. నాలుగు నెలలకు రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద, కేంద్ర ప్రభుత్వం ఆధార్, ఎన్‌పిసిఐకి అనుసంధానించబడిన బ్యాంకు ఖాతాలలో 14వ వాయిదాను చెల్లించింది.

NPCI లింక్డ్ బ్యాంక్ ఖాతా కోసం, లబ్ధిదారుడు ఇన్‌స్టాల్‌మెంట్‌ను స్వీకరించడానికి స్థానిక పోస్టాఫీసును సందర్శించవచ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB)లో కొత్త (DBT ఎనేబుల్డ్) ఖాతాను తెరవవచ్చు. ఇది కాకుండా, మీ బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్‌ను తనిఖీ చేయడం ద్వారా ఇంట్లో కూర్చొని కూడా తనిఖీ చేయవచ్చు.
eKYC పూర్తి చేసిన వారికే 14వ విడత విడుదలయింది. ఇప్పటికీ కూడా ఈకేవైసీ చేయని వారు వెంటనే చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. మీకు డబ్బులు వచ్చాయో లేదా తెలుసుకోవడానికి అధికారిక PM కిసాన్ పోర్టల్‌ని సందర్శించలచ్చు. 'ఫార్మర్స్ కార్నర్' కింద మరియు 'బెనిఫిషియరీ లిస్ట్' బటన్‌పై క్లిక్ చేయండి. లొకేషన్, డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్, బ్లాక్, విలేజ్ ఎంటర్ చేసి, 'గెట్ రిపోర్ట్' బటన్ పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications