ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. రైతులకు ఇప్పటి వరకు 12 విడతల లబ్ధి చేకూరింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు మోడీ ప్రభుత్వం ఏటా 6 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఏడాదికి మూడుసార్లు రైతుల ఖాతాలోకి రూ.2 వేల చొప్పున జమ చేస్తోంది.

13వ విడత ఎప్పుడంటే
పలు మీడియా కథనాల ప్రకారం, ఫిబ్రవరి 24న 13వ విడత రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని 2019లో ప్రారంభించారు. చివరిసారిగా అక్టోబర్ 17, 2022న ప్రధానమంత్రి కిసాన్ యోజన 12వ విడత డబ్బు అన్నదాతల ఖాతాల్లో జమ చేశారు.

eKYC
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన రైతులకు డబ్బు రావాలంటే వారు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి. ఇప్పటికీ మీరు ఈ కేవైసీ చేసుకోకుంటే వెంటనే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వెబ్ సైట్ కు వెళ్లి చేసుకోండి. మీరు మీ PM కిసాన్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయకుంటే, వీలైనంత త్వరగా ఈ పనిని పూర్తి చేయండి.

ప్రధానమంత్రి మంధన్ యోజన
కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఈ పథకంతో పాటు ప్రధాన మంత్రి కిసాన్ మంధన్ యోజన పథకం కూడా అమలు చేస్తోంది. ప్రధానమంత్రి మంధన్ యోజన కింద ప్రభుత్వం ప్రతి నెలా రూ.3000 పింఛన్ వస్తుంది. ఈ పెన్షన్ స్కీమ్‌లో రైతులు నెలవారీగా రూ.55 నుండి రూ.200 వరకు చందా చెల్లించాల్సి వస్తే, మీకు 60 ఏళ్లు వచ్చిన తర్వాత మీ ఖాతాలో రూ.3000 పింఛను జమ అవుతాయి. అయితే 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు మాత్రమే దీనికి అర్హులు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications